ఇంద్ర‌భ‌వ‌నం లోకి దీపీకా–ర‌ణ‌వీర్ కొత్త‌జంట‌.

Read Time: 1 minutes

బాలీవుడ్… మోస్ట్ గ్లామ‌రస్ ల‌వ‌ర్స్, అతి త్వ‌ర‌లో పెళ్లిచేసుకోబోతున్న దీపికా-ర‌ణ‌వీర్ జంట‌, పెళ్ల‌యిన త‌ర్వాత ఎక్క‌డ ఉండాలి, ఏ ఇంట్లో ఉండాలి అనే వాటిపై ఇప్పుడే దృష్టిపెట్టారు. ఇప్ప‌టికే పెళ్లికోసం కొంటున్న జ్యూవ‌ల‌రీ, మ్యారేజ్ అరెంజ్మెంట్స్ తో వార్త‌ల్లో నిలుస్తోంది ఈ జంట‌.

న‌వంబ‌ర్ 14-15 తేదీల్లో… వివాహం చేసుకోబోతున్న ర‌ణవీర్-దీపికాలు… పెళ్ల‌యిన త‌ర్వాత ఇంద్ర‌బ‌వ‌నం లాంటి ఇంట్లో కొత్త కాపురం మొద‌లుపెట్ట‌బోతున్నారు. అందుకోసంత త‌మ డ్రీమ్ హౌజ్ ఎలా ఉండాలి, ఇంటీరీయ‌ర్, ఎక్స్టీరీయ‌ర్ ఎలా ఉండాలి అన్న వారి ఆలోచ‌న‌ల అనుగుణంగా… వీలాస‌వంత‌మైన ఇళ్లు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే దాదాపు ప‌ని పూర్తికావ‌చ్చింద‌ని తెలుస్తోంది. అయితే… ఆ ఇళ్లు ఎంత ఖ‌ర్చుతో రెడీ అవుతుందో తెలుసా….. అక్ష‌రాల 70 కోట్లు. అవును… పెండ్లి విష‌యంలో ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుంటూ వెళ్తోన్న ఈ కొత్త జంట‌, ఇంటి విష‌యంలోనూ… భారీ బ‌డ్జేట్ కేటాయిస్తోంది. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ ముంబైలో, దీపికా ప‌దుకొణే బెంగుళూరులో నివాస‌ముంటున్నారు. వివాహం అయ్యాక‌… ముంబైలోని ప్ర‌ధాన‌మైన‌, వీఐపీలుండే ఏరియాలో ఈ కొత్త భ‌వ‌నం ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో బాలీవుడ్ అగ్ర‌తార‌లున్నార‌ని, 70 కోట్ల‌కు పైగా ఖ‌ర్చుతో… షారుఖ్ ఇళ్లు నిర్మించుకున్నార‌ని, అనుష్క‌–విరాట్ లు కూడా ఇదే ప్రాంతంలో నివాస‌ముంటున్నారంటోంది బాలీవుడ్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*