ఇదీ క‌ద‌… రాజ‌కీయం.

Read Time: 1 minutes

గ‌జ్వేల్ లో ఓట‌మి త‌ప్ప‌ద‌న్న భ‌యంలో…  కేసీఆర్ కు పార్టీ కార్య‌క‌ర్త‌లు గుర్తుకొచ్చారు. వెంట‌నే 15 వేల మందితో మీటింగ్ పెట్టాడు. కానీ ఎవ‌రూ ఊహించ‌ని సంఘ‌ట‌న అదే గ‌జ్వేల్ లో జ‌రిగింది. కేసీఆర్ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ…. ఔరా అనిపించాడు కాంగ్రెస్ నేత ఓంటేరు.

గ‌జ్వేల్ లో కేసీఆర్ అన్ని మండ‌లాల నాయ‌కుల‌ను త‌న ఫాంహౌజ్ కు పిలిపించుకున్నాడు. మీడియాకు అనుమ‌తి లేద‌ని ముందే చెప్పేశారు. కేసీఆర్ లాంటి వ్యూహ‌ర‌చయిత‌, సీఎంకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అవ‌త‌లి పార్టీ నాయ‌కుడు ఓంటేరు ఎలా ఊరుకుంటారు, ఎం చేస్తారు, నిజంగా కేసీఆర్ ను తట్టుకుంటాడా అని అంద‌రు ఊహించారు. కానీ కేసీఆర్–హ‌రీష్ ల ఎత్తుకు పైఎత్తు వేసి ఔరా అనిపించాడు ఓంటేరు.

ఇప్ప‌టికే గ‌జ్వేల్ లో అన్ని కులాల మీటింగ్ లు పూర్తి కాగానే… ఓవైపు ఫాంహౌజ్ లో కేసీఆర్ త‌న పార్టీ నేత‌ల‌తో సమావేశంలో ఉండ‌గానే… ఓంట‌రు అదే గ‌జ్వేల్ లో భారీ ముదిరాజ్ ల స‌భ ఏర్పాటు చేశాడు. దాదాపు 15వేల మంది స‌భ‌కు రావ‌టంతో స‌భా ప్రాంగ‌ణం మొత్తం కిక్కిరిసి పోయింది. ముదిరాజ్ ల సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా ఉన్న కాసాని జ్ఙానేశ్వ‌ర్ ముఖ్య అతిథిగా హ‌జ‌రుకావ‌టంతో… గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ముదిరాజ్ సంఘం నాయ‌కులు, జ‌నం భారీగా త‌ర‌లివ‌చ్చారు. దీంతో. కేసీఆర్ కు పోటీగా, ఆయ‌న అనుక‌న్న‌దానికంటే ఎక్క‌వ‌గా… ఒకే సామాజిక సంఘంతో అదే స్థాయి మీటింగ్ పెట్టిన‌ట్ల‌యింది. చూసే వారంతా… కేసీఆర్ స‌వాల్ కు ఓంటేర్ ప్ర‌తిస‌వాల్ సూప‌ర్ అంటూన్నారు. దీంతో… గ‌జ్వేల్ రాజ‌కీయం మ‌రింత వేడేక్క‌గా, గ‌జ్వేల్ ఫైట్ అనుకున్న దానికన్నా ఇంట్రెస్టింగ్ గానే ఉండేట్లు ఉంది అంటున్నారు పోలిటిక‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*