ఇదేం జ‌ర్న‌లిజం… ఈనాడు పై విమ‌ర్శ‌లు

Read Time: 0 minutes

ఈనాడు పేప‌ర్ అన్నా, ఆ గ్రూప్ అన్నా… ఎంతో క్రేడిబిలిటీ ఉంటుంది. అది రోజురోజు త‌గ్గుతుంద‌న్న విమ‌ర్శ‌ల‌కు చాన్స్ ఇచ్చేలా… రోజురోజుకు ప‌డిపోతుంది ఆ ప‌త్రిక గ్రాఫ్. ఆ ప‌త్రిక రాత‌ల‌పై… కూడా తీవ్ర‌మైన అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

కొంత‌కాలం క్రితం వ‌ర‌కు… ఆ పత్రిక‌లో ఓ వార్త వ‌స్తే, ప్ర‌బుత్వాలు షేక్ అయ్యేవి. అంత‌టి క్రేడిబిలిటీ ఆ ప‌త్రిక సొంతం. వార్త వ‌చ్చిందంటే, నిజం కాద‌ని ఎవ‌రు ఎంత అరిచి గీ పెట్టినా, నిజం లేనిది వారు రాయ‌రు కాదా అనేవారు. కానీ ఆ పత్రిక ప్ర‌మాణాలు ఘోరంగా ప‌డిపోతున్నాయ‌న‌డానికి ఇటీవ‌ల ఆ ప‌త్రిక పెట్టిన హెడ్డింగ్ చూస్తే…..

హైద‌రాబాద్ లో పులివెందుల ముఠా హ‌ల్ చ‌ల్ పేరుతో  ఓ వార్త ఆన్ లైన్ లో  ప్ర‌చురించింది. దీనిపై కొంద‌రు హైద్రాబాద్ వాసులు… ఇదేం హెడ్డింగ్ అంటూ పెద‌వి విరిస్తున్నారు. ఇది ఓ ప్రాంతాన్ని కించ‌ప‌ర్చ‌టం కాదా, ఆ ప్రాంతానికి చెందిన అంద‌రూ అలాగే ఉంటారా, ప‌త్రిక హెడ్డింగ్ చూస్తుంటే… ఆ ప్రాంతానికి చెందిన వారంతా ముఠాలో భాగ‌మా… అని ప్ర‌శ్నిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా… హైద్రాబాద్ లో విజ‌య‌వాడ వ్య‌భిచార బృందం అంటే ఎలా ఉంటుంది, వారికి బాధ అనిపించ‌దా…. ఓ ప్రాంతాన్ని కించ‌ప‌ర్చ‌టం ఏమీటీ అని వారు ఆవేధ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎదైనా ఉంటే నేరుగా విష‌యం చెప్పాలి కానీ, ఇదేమీ రాతలు…. ఓ ప్రాంతాన్నికించ‌ప‌ర్చ‌ట‌మంటే ఎంత ద్వేషం ఏర్ప‌రుచుకున్నారు, అలాంటి వారికి నికార్స‌యిన జ‌ర్న‌లిస్టులుగా ఎలా గుర్తిస్తారు అని వారు సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*