ఇద్ద‌రు కాదు… న‌లుగురు ఎంపీలు, షాక్ లో టీఆర్ఎస్ అధిష్టానం.

Read Time: 1 minutes

రేవంత్ రెడ్డి సూటిగా చెప్పేశాడు. కాంగ్రెస్ లోకి నీ ఇద్ద‌రు ఎంపీలు వ‌చ్చేస్తున్నారు… దమ్ము-దైర్యం ఉంటే కాపాడుకో. రాకుండా అడ్డుకో అని. కానీ… తీరా ఎవ‌రా ఇద్ద‌రు ఎంపీలు అని ఆరా తీస్తే… తెలిస్తోన్న విష‌యం ఎంటా అంటే… చేర‌బోయే ఎంపీలు ఇద్ద‌రు కాదు, న‌లుగురు ఎంపీలు అని. పైగా ఓ ఎమ్మెల్సీ బోన‌స్.

రంగారెడ్డి జిల్లా నుండి చేవేళ్ల ఎంపీగా  ఉన్న కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ లో చేర‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఆయ‌నే… 2019లో కాంగ్రెస్ పార్టీ అబ్య‌ర్థిగా అదే స్థానం నుండి పోటీచేయ‌నున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇక ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీతరాం నాయ‌క్ కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్ప‌బోతున్న‌ట్లు సమాచారం. పైగా.. అక్క‌డ ఆయ‌న ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కేంద్ర‌ మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్ ను ఆ పార్టీ అసెంబ్లీకి పంపిస్తుంది. దీంతో ఆయ‌న‌కు లైన్ క్లియ‌ర్ అయింది. ఇక ఇప్ప‌టికే పార్టీలో చేర‌టం కాస్త ఆలస్యం అయిన‌… ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కూడా పార్టీలో చేర‌నున్నారు. తుమ్మ‌ల వ‌ర్గంతో ప‌డ‌క‌ట పోవ‌టం, కేసీఆర్ కు సన్నిహితుడైన తుమ్మ‌ల‌ను కంట్రోల్ చేయ‌టంలో అధిష్టానం విఫ‌లం కావ‌టంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. పొంగులేటి అనుచ‌రుల‌కు ఈసారి ఒక్క‌రికి కూడా అసెంబ్లీ టికెట్ ఇవ్వ‌లేదు టీఆర్ఎస్. దీంతో ఆయ‌న అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇక‌… భువ‌న‌గిరి ఎంపీ బూర‌న‌ర్స‌య్య‌గౌడ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయ‌న‌తో… మాజీ ఎంపీ మ‌ధుయాష్కీ ట‌చ్ లో ఉన్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. ఆయ‌న ఈ సారి అసెంబ్లీకి వెళ్లాల‌ని భావించినా, టీఆర్ఎస్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ… ఎంపీగానే కొన‌సాగించేలా నిర్ణ‌యించింది. పైగా ఈసారి భువ‌న‌గిరి సీటును ఎలిమినెటి ఫ్మామిలీకి కేటాయిస్తార‌న్న వార్త‌లు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వ‌లేద‌ని… ఎంపీ బ‌రిలో ఉంటార‌ని తెలుస్తోంది.

వీట‌న్నింటికి తోడు… బోనస్ గా, కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత‌గా ఉండి… టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్సీ యాద‌వ రెడ్డి మ‌ళ్లీ సొంత‌గూటికి చేర‌బోతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న రాక‌కు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ల‌భించిన‌ట్లు తెలుస్తోంది.  అయితే.. ఎన్నిక‌ల  త‌ర్వాత క‌న్నా, పోలింగ్ కు రెండు,మూడు రోజుల ముందే చేరిక‌లు ఉండేలా చూడాలని, రాహుల్ ఆద్వ‌ర్యంలో చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తే… దాని ప్ర‌భావం పోలింగ్ పై ప‌డుతుంద‌ని, టీఆర్ఎస్ శ్రేణుల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ దోర‌ణిలోకి నెట్టేసిన‌ట్లు అవుతుంద‌ని కాంగ్రెస్ వ్యూహం రచించిన‌ట్లు క‌న‌ప‌డుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*