ఈటీవీ జ‌బ‌ర్ధ‌స్త్ నుండి హైప‌ర్ ఆది ఔట్.

Read Time: 1 minutes

త‌న‌దైన శైలీ పంచ్ ల‌తో,  బుధవారం ఎప్పుడు వ‌స్తుందా… జ‌బ‌ర్ధ‌స్త్ షోలో హైప‌ర్ ఆది స్కిట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు. అంతలా… హైప‌ర్ ఆది పంచ్ ల‌కు, జోక్స్ కు ఆద‌ర‌ణ ఉంటుంది. కానీ ఇక మీద హైప‌ర్ ఆది పంచ్ లు ఈటీవీ జ‌బర్ధ‌స్త్ లో క‌న‌ప‌డేలా లేవు.

ఆది క‌న్నా ముందు… ఎంతో మంది ఈ షో ద్వారా ప్ర‌జ‌ల‌ను అల‌రించారు. కొంత‌మంది బూతు షో… డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్ షో అని విమ‌ర్శించినా… షోకు ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. రోజురోజుకు పెరిగింది. ఎంత‌లా అంటే… ఆ షో స‌మ‌యంలో మిగ‌తా చానళ్ల రేటింగ్ దారుణంగా ప‌డిపోయేలా. అయితే… హైప‌ర్ ఆదికి ఉన్న క్రేజ్ కూడా వీరికి క‌లిసివ‌చ్చేది. కానీ, ఈ మ‌ద్య ఆదికి సినిమా చాన్స్ లు ఎక్కువ‌య్యాయి. ఆయ‌న కూడా వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు సైన్ చేస్తుండ‌టంతో… ఇటు జ‌బ‌ర్ధ‌స్త్ కు , అటు సినిమాల‌కు డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌టంతో… జ‌బ‌ర్ధ‌స్త్ కు గుడ్ బై చెప్ప‌నున్నారు అని తెలుస్తోంది. అందుకే గ‌త రెండు వారాలుగా… ఆది స్కిట్స్ రావ‌టం లేదు. ఇప్పుడే కాదు.. గ‌తంలో కూడా… షూటింగ్ కోసం ఆది విదేశాల‌కు వెళ్లాల్సి రావ‌టంతో….స్కిట్స్ రాలేదు. దాని ప్ర‌భావం షో పై ఖ‌చ్చితంగా ఉంటుంది. ఇక ఆది… జ‌న‌సేన‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌హ‌రిస్తారు అన్న వార్త కూడా షికారుచేస్తోంది.

మ‌రీ, ఈటీవీలోని కీల‌క షో నుండి ఆది వెళ్లిపోవ‌టం… నిజంగా తీర‌ని లోటంటున్నారు అభిమానులు.

అతి తక్కువ సమయంలో ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్, పంచ్ లతో ఆడియన్స్ ను నవ్విస్తుంటాడు. అతడి ఎపిసోడ్ కోసం షోని చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు.

అంతగా ఈ షోతో పాపులర్ అయిన హైపర్ ఆది ఇప్పుడు షో నుండి బయటకి వెళ్లిపోనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత సినిమా అవకాశాలు రావడంతో షో నుండి చాలా మంది కమెడియన్లు తప్పుకున్నారు.

ఇప్పుడు వారిలానే హైపర్ ఆదికి కూడా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఓ పక్క షో, మరోపక్క సినిమాలతో బిజీగా గడుపుతోన్న హైపర్ ఆది రెండు వారాలుగా షోలో కనిపించడం లేదు. దీంతో ఆది విషయంపై రకరాల చర్చలు మొదలయ్యాయి.

పూర్తిస్థాయిలో సినిమాలలో నటించడానికే అతడు షో నుండి దూరమవుతున్నాడని టాక్. మరోవైపు హైపర్ ఆది ‘జనసేన’ పార్టీలో జాయిన్ అవుతాడని, ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికే షోకి దూరమయ్యాడని కొంతమంది వాదిస్తున్నారు. మరి దీనిపై హైపర్ ఆది స్పందిస్తాడో లేదో చూడాలి!

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*