ఉత్త‌మ్ పెద్ద దైర్య‌మే చేశాడంటోన్న పార్టీ సీనీయ‌ర్స్

Read Time: 0 minutes

పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని  ఈ విష‌యంలో ఒప్పుకోవ‌చ్చు అంటూ, కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత‌లూ ప్ర‌శంసిస్తున్నారు. ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో… పార్టీ క్యాడ‌ర్ కు ఉత్తమ్ ఇస్తున్న ద‌న్ను, కార్య‌క‌ర్త‌ల‌కు ఎంతో ధైర్యం ఇచ్చేలా ఉంద‌న్న అభిప్రాయం పార్టీలో వ్యక్త‌మ‌వుతోంది.

కాంగ్రెస్ లో ఏ విష‌యంలో అయినా… భిన్నాభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వుతాయి. నేత‌లెప్పుడూ ఓకే మాట‌పై ఉండ‌టం చాలా అరుదు. కానీ… ఉత్త‌మ్ చేసిన వాఖ్య‌ల‌కు మాత్రం, పార్టీ నేత‌లంతా  మ‌ద్ద‌తివ్వ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెల‌వ‌బోతుంది. మ‌హ‌కూట‌మి త‌రుపున ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నాం…. అలా కానీ ప‌క్షంలో, టీఆర్ఎస్ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే ఇక మ‌ళ్లీ నా మొఖం గాంధీబ‌వ‌న్ కు చూపించా. గాంధీ బ‌వ‌న్ లో అడుగే పెట్ట అంటూ ఉత్త‌మ్ ప్ర‌క‌టించ‌టం హ‌ట్ టాపిక్ అవుతోంది. పార్టీ అద్య‌క్షుడిగా గెలుపుపై  ఎంత న‌మ్మ‌కం ఉంటే… ఉత్త‌మ్ అంత కాన్ఫిడెంట్ గా ఉంటారు అని కాంగ్రెస్ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

గాంధీబ‌వ‌న్ లో నేత‌లే కాదు… ఉత్త‌మ్ ప్ర‌క‌ట‌న మ‌హ‌కూట‌మి మ‌నోదైర్యాన్ని మ‌రింత పెంచిన‌ట్ల‌యింద‌ని, కేసీఆర్ తో పోరాడుతున్న కాంగ్రెస్ నేత‌ల‌కు, అబ్య‌ర్థుల‌కూ యుద్దంలోకి త‌న సైన్యానికి ఊపునిచ్చే అంశ‌మ‌ని, సైనికుల్లా పోరాడుతున్న వారి ధైర్యాన్ని, న‌మ్మ‌కాన్ని పెంచేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఉత్త‌మ్ అంటే గిట్ట‌ని నేత‌లు సైతం… ఉత్త‌మ్ తాజా ప్ర‌క‌ట‌న‌పై సానుకూలంగా స్పందిస్తున్నారు.

కొంత‌కాలంగా… ఉత్త‌మ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో వెళ్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. ఓవైపు త‌న నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెడుతూనే, పార్టీలో ఇత‌ర అంశాల‌పై దృష్టిపెడుతున్నార‌ని, మ్యానిఫెస్టో అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లటంలో కొత్త పంథా అవ‌లంభిస్తున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*