ఎంపీ కొండా బ‌య‌ట‌పెట్టిన సంచ‌ల‌న విష‌యాలు…

Read Time: 0 minutes

కేసీఆర్ కు …  ఎప్పుడు ఎవ‌రిన్నీ, ఎలా వాడుకోవాలో బాగా తెలుస‌ని, అలా వాడుకొని వ‌దిలేయ‌టంలో… కేసీఆర్ సిద్ధ‌హ‌స్తుడంటూ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి సంచ‌ల‌న అంశాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. తాను టీఆర్ఎస్ లోకి వ‌చ్చింది మొద‌లు, ఎలా త‌న‌ను ఇబ్బందిపెట్టారో మీడియాకు వివ‌రించాడు.

మా తాత రంగారెడ్డి పేరును వాడుకునేందుకు న‌న్ను 2014లో టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. చేర్చుకున్న రోజే… నారాయ‌ణ‌రావు కు 6 కోట్లు, మ‌రో వ్య‌క్తికి 2 కోట్లు ఇవ్వ‌మ‌న్నారు. దాంతో కాద‌న‌లేక ఇచ్చేశా. నేను గెలుస్తాన‌న్న న‌మ్మ‌కం వారికి లేకున్నా, స్వంత గుర్తింపు… తెలంగాణ ఉద్య‌మ‌కారుడిగా నాకు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆ త‌ర్వాత కేసీఆర్ మాట తీరు మారింది. నేను మంచి డ్రెస్ వేసుకున్నా కామెంట్స్ చేసేవాడు. అప్పుడు జై తెలంగాణ అన్న నేత‌లం అంతా… ఇప్పుడు జై కేసీఆర్, జై కేటీఆర్ అనాల్సిన ప‌రిస్థితికి తీసుకొచ్చారు. పార్టీ ప‌రువు కోస‌మే ఇన్నాళ్లు వేయిట్ చేసినా, వారు ఎమాత్రం మార‌టం లేదు. నా నియోజ‌క‌వ‌ర్గ‌మే అయినా… తాండూరు, చేవేళ్ల‌లో మ‌హేంద‌ర్ రెడ్డి మాట‌ల ప‌ట్టుకొని న‌న్ను అడుగుపెట్ట‌నివ్వ‌లేదు. కేసీఆర్ కు చెప్పినా… లాభం లేకపోయింది. న‌న్ను పార్ల‌మెంట్ కు వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధించారు. పార్టీ ఎంపీల‌యినా… కేకే, జితేంద‌ర్ రెడ్డిలు కూడా అసంతృప్తితోనే పార్టీలో ఉంటున్నార‌ని బాంబు పేల్చాడు.

నేను టీఆరెస్  నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా, ఎంపీ వినోద్ నాకు ఫోన్ లో అభినందించార‌ని, ఇంకా చాల మంది నేత‌లు బ‌య‌ట‌కు రాబోతున్న‌ట్లు జోస్యం చెప్పారు. త‌న కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి మ‌నుషులు దారుణంగా కొడితే, క‌నీసం కేసు కూడా పెట్టించ‌లేక‌పోయా… అంతలా వారు మ్యానేజ్ చేస్తున్నారు, నా మ‌నుషుల‌కే న్యాయం చేయ‌లేక‌పోతే… నేను ఇంకా ఆ పార్టీలో ఉండ‌టం ఎందుక‌నే రాజీనామా చేశా, త్వ‌ర‌లో ఎంపీ ప‌ద‌వికీ రాజీనామా కూడా చేయ‌బోతున్న‌ట్లు తెలిపారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*