ఎదురుతిరుగోన్న ఓవైసీ బ్ర‌ద‌ర్స్… పోలింగ్ కు ముందే వేడి.

Read Time: 1 minutes

టీఆర్ఎస్–ఎంఐఎం క‌లిసే ఎన్నిక‌ల‌కు వెళ్తున్నాం, ఇద్ద‌రం మంచి మిత్రువుల‌మే… ఇది కేసీఆర్ మాట‌. కానీ ఓవైసీ బ్ర‌ద‌ర్స్ మెల్ల‌గా… టీఆర్ఎస్ కు దూరం జ‌రుగుతున్నారా, మేం అంద‌రికీ స‌మ దూరమే అని చెప్ప‌టంతో పాటు, వ‌చ్చే ప్ర‌భుత్వాల్లో ఓవైసీలు కీల‌కం కావాల‌నుకుంటున్నారా…?  నిజం అంటున్నాయి ప్ర‌స్తత ప‌రిస్థితులు, అన్న‌ద‌మ్ముల మాట‌లు.

కారు స్టేరింగ్ నా ద‌గ్గ‌రే ఉంది, అటు వైపే వెళ్లంటి… మా వైపు వావొద్దు– ఇది అస‌ద్ చేసిన వాఖ్య‌లు. అంత‌కు ముందే… మేము కూడా కుమార‌స్వామిలా చ‌క్రం తిప్ప‌బోతున్నాం, మ‌న‌మే సీఎం అవుతాం అంటూ అక్బ‌ర్ వాఖ్య‌లు చేశాడు. స‌రే… ఎదో ఉత్సాహంలోనో, కార్య‌క‌ర్త‌ల‌తో ఖుషీ కోసం అన్నార‌ని కొట్టిపారేశారు. కానీ… అక్బ‌ర్ మ‌రోసారి గ‌తం క‌న్నా భిన్నంగా మ‌రింత దూకుడుగా వెళ్తున్నాడు. నాటి చంద్ర‌బాబు నుండి నేటీ కేసీఆర్ వ‌ర‌కు ఎవ‌రైతే నాకేంటి, మ‌న మాట వినాల్సిందే… మ‌నం చెప్పిన‌ట్లు న‌డ‌వాల్సిందే. న‌డిచారు… ఇక ముందు న‌డ‌వాల్సిందేనంటూ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. దీంతో… అన్నీ పార్టీలు ఉలిక్కిప‌డ్డ‌ట్ల‌యింది. డిసెంబ‌ర్ 11 తర్వాత అస‌లు సినిమా చూపిస్తాం… మ‌నం ఎం చెప్తే అది న‌డ‌వాల్సిందేనంటూ అక్బ‌ర్ వాఖ్య‌లు చేయ‌టం టీఆర్ఎస్ ముఖ్యుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుండ‌గా, ఎంఐఎం మ‌ద్ద‌తు త‌ప్పనిస‌రై… ప్ర‌బుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వ‌స్తే… టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌టం అంత హీజీ కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇన్నాళ్లు… కేసీఆర్, ఎంఐఎంను గుడ్డిగా న‌మ్మార‌ని, గ‌తంలో త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని… అస‌ద్ చెప్ప‌టంతోనే జాగ్ర‌త్త‌ప‌డ్డందుకు కృత‌జ్ఙ‌త‌గా ఇన్నాళ్లు కేసీఆర్ కూడా వారిని చూసిచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే… ఇప్పుడు ఏకు  మేకు అయ్యార‌ని టీఆర్ఎస్ నేత‌లు మండిప‌డుతున్నారు.

మిత్రుల‌మే అంటూ కేసీఆర్ ఆప‌న్న హ‌స్తం ఇస్తుంటే, మాకు కీల‌క అధికారం కావాలంటూ… మ‌జ్లిస్ దూకుడుగా వెళ్తోంది. చివ‌రకు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*