ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు… టీడీపీకి మ‌ళ్లీ మంచిరోజులు?

Read Time: 0 minutes

2014కు ముందు…తెలంగాణ‌లో  టీడీపీ బ‌లం ఎంటో అందరికీ తెలుసు. టీడీపీ పునాదుల మీదే టీఆర్ఎస్ నిల‌బ‌డ్డ‌ద‌ని సూటిగా విమ‌ర్శ‌లు చేసిన వారు ఉన్నారు. ఒక్కో నాయ‌కుడు వెళ్తున్నా… త‌ట్టుకొని నిలబ‌డ్డ టీడీపీకి మ‌ళ్లీ మంచిరోజులు వ‌స్తున్నాయా అంటే అవున‌నే అనిపిస్తోంది.

తెలంగాణ క్యాబినెట్ లో దాదాపు టీడీపీ మంత్రులే అని ఆ పార్టీ ఎన్నో సార్లు విమ‌ర్శించింది. కేసీఆర్ టీడీపీ టార్గెట్ గా రాజ‌కీయాలు చేయ‌టం, తెలంగాణ వ్య‌తిరేక పార్టీగా ముద్ర‌వేయ‌టంతో… ఆ పార్టీ పూర్తిగా న‌ష్ట‌పోయింది. అంత పెద్ద తెలంగాణ వేవ్ లో కూడా 16సీట్లు గెల్చుకొని నిల‌బ‌డ్డా, ఆ త‌ర్వాత కేసీఆర్ దెబ్బ‌కు పూర్తిగా క‌న‌మరుగ‌యింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అండ‌తో టీడీపీ మ‌ళ్లీ పున‌ర్వైభ‌వానికి తాప‌త్రేయ‌ప‌డుతోంది.

అయితే, నేత‌లు వెళ్లిపోవ‌ట‌మే గానీ… కొత్త‌వారు రాక‌పోవ‌టంతో నాయ‌కుల లేమీ ఉన్న స‌మ‌యంలో, చాలా రోజుల త‌ర్వాత తెలంగాణ తెలుగుదేశంలో చేరిక‌లు మొద‌ల‌య్యాయి. ఏ ముహుర్తంలో మ‌హ‌కూట‌మిలో చేరిందో కానీ… మొన్న ప‌టాన్ చెఱులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వ‌ర్ గౌడ్ రావ‌టం, ఇప్పుడు టీఆర్ఎస్ నుండి ఖ‌మ్మంలో ఆ పార్టీ జిల్లాద్య‌క్షుడు, ఉద్య‌మ‌కారుడు బ‌డాంగ్ బేగ్ పార్టీలో చేరటంతో తెలంగాణ త‌మ్ముళ్లు సంతోషంగా ఉన్నారు. ఇక వీరికి తోడు… ఎప్ప‌టి నుండో పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న కూక‌ట్ ప‌ల్లి టీఆర్ఎస్ ఇంచార్జీ గొట్టిముక్క‌ల ప‌ద్మారావు కూడా ఇప్ప‌టికే టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్ప‌గా, తాజాగా ఆయ‌న కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో… కార్య‌క‌ర్త‌లు మ‌ళ్లీ మాకు మంచి రోజులు రాబోతున్నాయంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక మ‌హ‌కూట‌మి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే, తామే క్రీయాశీల‌కం కాబోతున్నామ‌ని గ‌ట్టిగా న‌మ్ముతున్న టీడీపీ…. ఖ‌చ్చితంగా మ‌ళ్లీ మేము టీడీపీ నాయ‌కులం అంటూ గ‌ర్వంగా తిరిగ రోజు వ‌స్తుంద‌ని సంబుర‌ప‌డుతున్నారు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*