ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ‌… కేటీఆర్, అస‌ద్ భేటీ.

Read Time: 1 minutes

నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసింది. ఇక ప్ర‌చార యుద్దం మ‌రింత వేడేక్కనుంది. అయితే… ఇలాంటి కీల‌క స‌మ‌యంలో, ఫ్రెండ్లీ ఫైట్ లో ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి వెళ్తున్నాయి. ఇలాంటి కీల‌క స‌మ‌యం లో కేటీఆర్, అస‌ద్ భేటీ కావటం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఓవైపు బీజేపి… త‌న హిందుత్వవాదంతో ముందుకెళ్తున్న సంద‌ర్భంలో, మ‌హ‌కూట‌మికి చెక్ పెట్టేలా… టీఆర్ఎస్, ఎంఐఎం వ్యూహాలు ర‌చిస్తున్నాయి. రాజేంద‌ర్ న‌గ‌ర్ లో కూడా టీఆర్ఎస్-ఎంఐఎం నేత‌ల మ‌ద్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇటీవ‌లే ఎంఐఎం నేత అస‌ద్… నిర్మ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో, త‌న‌కు 25 ల‌క్ష‌లు లంచం ఇవ్వ‌జూప‌రని చెప్ప‌టం సంచ‌ల‌నం సృష్టించింది.  ఈ రెండు అంశాల‌తో పాటు… రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్లాల‌నే వ్యూహం సిద్దం చేసిన‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా… కొన్నిచోట్ల ముస్లీం ఓట్ల సంఖ్య భారీగా ఉంది. ఉమ్మ‌డి అదిలాబాద్, మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఎంఐఎం మ‌ద్ద‌తుకోరుతుంది టీఆర్ఎస్ పార్టీ. వీటితో పాటు గ్రేట‌ర్ లో టీఆర్ఎస్ ఖాతా తెరువాల‌న్నా… ఎంఐఎం మ‌ద్ద‌తు ఉండాల్సిందేన‌ని కేసీఆర్ బ‌లంగా న‌మ్ముతున్నార‌ని, అందుకే… అస‌ద్ ను, అక్బ‌ర్ ను మ‌చ్చిక చేసుకుంటున్నార‌న్న వార్త‌లు ఇప్ప‌టికే గ‌ప్పుమ‌న్నాయి. ఇలాంటి స‌మ‌యంలో… వీరి భేటీ చాలా కీల‌క‌మ‌ని భావిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇక‌, టీఆర్ఎస్ అబ్య‌ర్థుల‌ను ఎంఐఎంలు సిట్టింగ్ లుగా ఉన్న చోట పేరుకు నిల‌బెట్టినా, అక్క‌డ కేసీఆర్ ప్ర‌చారం చేయ‌బోర‌ని తెలుస్తోంది. మొత్తం హైద‌రాబాద్ కు ఒక స‌భ మాత్ర‌మే పెడుతార‌ని, టీఆర్ఎస్ అబ్య‌ర్థులున్న చోట కేటీఆర్ మాత్ర‌మే రోడ్ షోలు, ప్ర‌చారం నిర్వ‌హిస్తార‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*