ఎన్నిక‌ల త‌ర్వాత‌… కేసీఆర్ కూడా మ‌హ‌కూట‌మిలోకే.

Read Time: 1 minutes

ఎన్నిక‌ల తర్వాత కేసీఆర్ కూడా మ‌హ‌కూట‌మిలోకేనా… అందేంటి, ఎవ‌డ్రా ఈ వార్త రాసింది అనుకుంటున్నారా….? స‌హ‌జ‌మే. ఆ డౌట్ రావాలి కూడా. నిజంగానే. .. కేసీఆర్ అడుగులు వేయ‌బోతున్న మ‌హ‌కూట‌మి వాస్త‌వం. అయితే… ప్ర‌స్తుతం మ‌న‌కు క‌న‌ప‌డుతోన్న మ‌హ‌కూట‌మి, కేసీఆర్ చేర‌బోయే మ‌హ‌కూట‌మికి చాలానే తేడాలున్నాయి. అస‌లీ క‌థేంటీ అనుకుంటున్నారా……?

ప్ర‌స్తుతం మ‌హ‌కూట‌మి అంటే… కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సిపిఐ. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా కూట‌మి క‌ట్టి, కేసీఆర్ ఓట‌మే ధ్యేయంగా ప‌నిచేస్తున్నాయి. వార్ వ‌న్ సైడే అనుకున్న స‌మ‌యంలో… ఈ కూట‌మి ఇప్పుడు కేసీఆర్ కు ట‌ఫ్ ఫైట్ ఇస్తుంది. అందుకే మొన్న‌టి వ‌ర‌కు 100కు పైగానే సీట్లు ప‌క్కా అనుకున్నారు కానీ, కేసీఆర్ కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అని ముద్ర‌ప‌డ్డ ఆంద్ర‌జ్యోతి సైతం కేసీఆర్ కు 60కి మించి రావ‌టం క‌ష్ట‌మేన‌ని తేల్చేసింది. అంటే ప‌రిస్థితి ఈ నెల‌న్న‌రలో మారింద‌న్న మాట‌. ఎన్నిక‌లు ఇంకా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి, పోలీంగ్ నాటికి ఇంకా ప‌రిస్థితి మారే అవ‌కాశం ఉంది. అప్పుడు కేసీఆర్ కు 50కు మించ‌వ‌ని కాంగ్రెస్ కూడా అంచ‌నా వేస్తోంది.  దీనిపై ముందే ఓ ఆలోచ‌న‌తో ఉన్న కేసీఆర్… టీఆర్ఎస్ కు 50సీట్ల‌కు మించి వ‌చ్చే ప‌రిస్థితి లేక‌పోతే… తాను కూడా ఓ మ‌హ‌కూట‌మి ఏర్పాటు చేయ‌బోతున్నార‌న్న మాట‌.

ఎంఐఎం కు ఎలాగు 7 సీట్లు వ‌స్తాయి. బీజేపీకి ఎంత చెడ్డా… 3 సీట్లు ప‌క్కా. సో… కేసీఆర్, బీజేపీ కూట‌మి క‌ట్టి, ఎప్ప‌ట్లాగే ఎంఐఎం మ‌ద్ద‌తు భ‌య‌ట‌నుండి తీసుకొని… స‌ర్కార్ ఏర్పాటు చేస్తాయ‌న్న మాట‌. ఇదే కేసీఆర్ ఏర్పాటు చేసి, చేర‌బోయే మ‌హ‌కూట‌మి. అందుకే కేసీఆర్… ముందుజాగ్ర‌త్త‌తో మోడీని-ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ను చెరో జెబులో పెట్టుకొని తిరుగుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు ప్ర‌స్తుత మ‌హ‌కూట‌మి నేత‌లు.

చూడాలి మ‌రీ… ఎవ‌రు, ఎ మ‌హ‌కూట‌మి అధికారంలోకి వ‌స్తుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*