ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ కు గట్టి షాక్

Read Time: 1 minutes

పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే, పొడుగోని నెత్తి పోష‌వ్వ కొట్టింద‌ని ఓ సామెత‌. ఆ సామెత ఇప్పుడు టీఆర్ఎస్ కు ప‌క్కాగా ప‌నికొచ్చేట్లుంది. ఇన్నాళ్లు… ఆ పార్టీ, ఈ పార్టీ నుండి నేత‌ల‌ను, ఎంపీ-ఎమ్మెల్యేల‌ను తెచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉల్టా షాక్ త‌గ‌ల‌బోతోంది. అతి త్వ‌ర‌లో ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

మ‌మ్మ‌ల్నే ఓడించే ప్ర‌య‌త్నాలు అంటూ… దొంగ నాట‌కాలు మొద‌లుపెడుత‌వా, కాచుకో… ఓట్లు డ‌బ్బాలో ప‌డే లోపు నీ ఇద్ద‌రు ఎంపీలు కాంగ్రెస్ లో చేర‌బోతున్నారు, ద‌మ్ముంటే ఆపుకో అంటూ స‌వాలు విసిరారు కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. దీంతో… తెలంగాణ రాజ‌కీయవ‌ర్గాలు ఒక్క‌సారిగా వేడేక్కాయి. ఎవ‌రా ఇద్ద‌రు ఎంపీలు అన్న‌ది సర్వ‌త్రా ఉత్కంఠ‌గా మారింది. అయితే… ఇందులో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎంపీ ఉన్న‌ట్లు స‌మాచారం వ‌స్తోంది. మిగిలిన ఒక‌రు ఎవ‌రా అన్న చ‌ర్చ న‌డుస్తోన్న‌… హైద‌రాబాద్ కు ఆనుకోని ఉన్న వారే ఆ ఇద్ద‌ర‌ని స‌మాచారం. న‌ల్గొండ జిల్లాలోనే స‌దరు ఎంపీ ప్రాతినిద్యం వ‌హిస్తార‌ని అంటున్నారు రేవంత్ అనుచ‌రులు.

ఈ ఇద్ద‌రులో… ఒక‌రు ఓసీ సామాజిక వ‌ర్గం నేత కాగా, మ‌రోక‌రు బీసీ వ‌ర్గ నేత అని తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు కొంత కాలంగాటీఆరెఎస్ తో అంటీముట్ట‌న‌ట్లుగా ఉన్నారు. స‌ద‌రు బీసీ నేత అసెంబ్లీకి వెళ్లాలి అనుకున్నా… కేసీఆర్ చాన్స్ ఇవ్వ‌లేదు. ఇక ఖ‌మ్మం ఎంపీ పొంగులేటీ కూడా ఆమద్య కాంగ్రెస్ తో ట‌చ్ లో ఉన్నార‌న్న వార్త‌లు బ‌లంగా వినిపించాయి. ఆయ‌న కంపెనీ రాఘ‌వ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ పై ఐటీ దాడులు జ‌ర‌గకుండా ఉండి ఉంటే, స‌ద‌రు నేత ఇప్ప‌టికే కాంగ్రెస్ కండువా క‌ప్పుకునే వార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

దీంతో… టీఆర్ఎస్ నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. సీఎం స‌న్నిహిత నేత‌గా ఉన్న న‌ల్గొండ నేత‌కు ఈ బాద్య‌త అప్ప‌జెప్పిన‌ట్లు తెలుస్తోంది. చూడాలి మ‌రీ స‌ద‌రు నేత‌ల‌ను కేసీఆర్ ఎంత‌మేర‌కు ఆప‌గ‌ల‌డో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*