ఎప్ప‌టికైనా… ముస్లీంల‌కు అండ కాంగ్రెస్సే.

Read Time: 0 minutes

ముస్లీం మైనారిటీ ఓటు బ్యాంకును  కొన్ని పార్టీలు వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని, కానీ ముస్లిం ప్ర‌జ‌ల కోసం ఎప్ప‌టికీ తోడుండేది కాంగ్రెస్ పార్టీయేన‌ని స్ప‌ష్టం చేశారు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌… ఉత్త‌మ్ ముస్లీం మ‌త పెద్ద‌ల‌తో స‌మావేశం కావ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కొన్ని అంశాల్లో… భిన్నాభిప్రాయాలున్న మాట వాస్త‌వ‌మేన‌ని, కానీ… బీజేపిని ఎద‌ర్కోవాల‌న్నా, ముస్లీం మైనారిటీల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా… వారికి న్యాయం జ‌ర‌గాల‌న్న కాంగ్రెస్సే అండ‌గా ఉంటుంద‌ని గుర్తుచేశారు. ముస్లీంల‌కు అన్ని ర‌కాలుగా న్యాయం చేసే బాధ్య‌త, ప్రాధాన్య‌త త‌మదేన‌ని తెలిపారు.  కాంగ్రెస్ కు ముస్లీంల‌తో ఉన్న అనుభందాన్ని గుర్తుచేసిన ఆయ‌న‌, ఇటీవ‌ల చార్మినార్ కు రాహుల్ ను ర‌ప్పించామ‌ని తెలిపారు.

బీజేపి అధికారంలోకి వ‌చ్చాక‌, ముస్లీంలు అభ‌ద్ర‌త‌కు లోన‌వుతున్నార‌ని, అలాంటి ముస్లీంల‌కు అండ‌గా ఉండాల్సింది పోయి… బీజేపితో కేసీఆర్ అంట‌కాగుతున్నార‌ని మండిప‌డ్డారు. పైగా వారికి ఓవైసీలు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని… దీనిని మీరు గ్ర‌హించాల‌ని ముస్లీం మ‌త పెద్ద‌ల‌ను కోరారు ఉత్త‌మ్.  ముస్లీంల‌కు రిజర్వేష‌న్లు క‌ల్పించింది కాంగ్రెస్ స‌ర్కారేన‌ని, ప్ర‌భుత్వంలోనిక వ‌చ్చాక‌… మీ క‌ష్టాల‌ను తీరుస్తామ‌ని హ‌మీ ఇచ్చారు. 12శాతం రిజ‌ర్వేష‌న్ పేరుతో కేసీఆర్ మిమ్మ‌ల్ని మోసం చేశార‌ని, ఎందుకు రిజ‌ర్వేష‌న్లు సాధించ‌లేక‌పోయార‌ని ప్ర‌చారంలో నిల‌దీయాల‌ని కోరారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*