ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తోన్న పోలిటికల్ స్టార్స్.

Read Time: 0 minutes

గ‌తం ఎంత ఘ‌న‌మైతే ఏందీ… ఇప్పుడు ప‌రువు కాపాడుకునే ఉద్దేశంతో రాజ‌కీయ నేత‌లంతా సానుభూతి కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. నేరుగా వెళ్తే గెలుపు పై న‌మ్మ‌కం లేని నేత‌లంతా, ఇప్పుడు ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా… ఓట‌మి త‌ప్ప‌ద‌ని అంచ‌నాకు వ‌చ్చిన నేత‌లు, గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని డిసైడైన నేత‌లంతా ఇప్పుడు ఎమోష‌న‌ల్ అవుతూ, జ‌నాన్ని ఎమోష‌న‌లైజ్ చేయ‌టంపై దృష్టిసారిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి ఖ‌మ్మం జిల్లా టీఆర్ఎస్ అగ్ర‌నేత తుమ్మ‌ల కూడా చేరిపోయారు. త‌న‌కు అస‌లు పోటీయే ఇష్టం లేద‌ని, మీకోసం… రాష్ట్రం కోసం కేసీఆర్ ప‌ట్టుబ‌డితేనే పోటీలో ఉన్నా. మీకు ఏదైనా చేయాలంటే ఈ సారి గెలిపించండి చేసి చూపిస్తా. నేను వ్య‌వ‌సాయం చేసుకుందామ‌నుకుంటే కేసీఆరే బ్ర‌తిమాలి మ‌రీ పోటీకి దించాడంటూ, తుమ్మ‌ల ప్ర‌జ‌ల ఆగ్ర‌హ‌న్ని త‌ప్పించుకునే ప్లాన్ వేశాడు.

ఒక్క తుమ్మ‌ల‌నే కాదు… మ‌రో తాజా మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బీఎస్పీ నుండి పోటీ చేసే స‌మ‌యంలోనే ఇవే నాకు చివ‌రి ఎన్నిక‌లు, గౌర‌వంగా త‌ప్పుకునే చాన్స్ ఇచ్చి, ఈ ఒక్క‌సారి గెలిపించ‌డ‌ని కోరీ గెలిచాడు. అయితే ఈసారి మాత్రం… న‌న్ను సీఎం క‌సీఆర్ ప‌ట్టుబ‌ట్టి నిల‌బ‌డ‌మ‌న్నార‌ని చెప్పుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఈసారి కూడా మంత్రి అవుతామ‌ని, మ‌న ప్రాంతం అభివృద్ది కోసమే మ‌ళ్లీ పోటీచేస్తున్న‌ని చెప్పుకొస్తున్నారు ఆయ‌న అనుచ‌రులు.

ఇక గెలుపు కోసం అన్నీ దారులు వెతుకుతోన్న మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు… గ‌జ్వేల్, కొడంగ‌ల్. ఈ రెండు చోట్ల కూట‌మి  అబ్య‌ర్థులు గా ఉన్న ఓంటేరు ప్ర‌తాప్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు కూడా… ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ కే జై కొట్టారు.  కేసీఆర్ ను త‌ట్టుకోవాలంటే… ఎదో ఒక సానుభూతి త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన ఈ ఇద్ద‌రు నేత‌లు… మ‌మ్మ‌ల్ని చంపేస్తారంటూ ప్ర‌క‌టిస్తున్నారు. ఓంటేరు అయితే… ఏకంగా ఏడుస్తూ, ప్ర‌జ‌ల్లోకి వెళ్తుండ‌గా, న‌న్ను చంపెస్తార‌ని… నక్స‌ల్స్ ముసుగులో చంపేసే కుట్ర‌లు జ‌రిగాయంటూ రేవంత్ త‌న ప్ర‌చారాల‌ను ర‌ద్దు చేసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఇక చిన్నాచిత‌క నేత‌లు, గ‌తంలో రెండు మూడు సార్లు ఓడిపోయి… చివ‌రి సారిగా పోటీలో ఉన్నామంటూ సానుభూతి పొందే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

మొత్తంగా… పెద్ద నేత‌లు, చిన్న నేత‌లు అని తేడా లేకుండా… గెలుపుపై ఏ మాత్రం అనుమానం ఉన్నా… ఏమోష‌న‌ల్ బ్లాక్ మెయిలింగ్ కే జై కొడుతున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*