ఐటీ ఇలాకాలో… చంద్ర‌బాబూ స్పీచ్ సూప‌ర్.

Read Time: 0 minutes

నేను మీకోసం క‌ష్ట‌ప‌డ్డా… హైద‌రాబాద్ లో ఐటీ నిర్మాణానికి, ఐటీ అభివృద్ది కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డా. మీరు నాకోసం.. ఈ రాష్ట్ర భ‌విష్య‌త్ కోసం ఐటీ ఉద్యోగులు ఈ వీకెండ్ కు సెల‌వుల పేరుతో విహ‌ర‌యాత్ర‌ల‌కు వెళ్ల‌కుండా, మ‌హ‌కూట‌మికి ఓటేయాలంటూ పిలుపునిచ్చిన చంద్ర‌బాబు… గ్రేట‌ర్ లో చంద్ర‌బాబు రోడ్ షోలు చేశారు.

తెలంగాణ‌లో టీడీపీ బ‌లం ఎలా ఉన్నా, గ్రేట‌ర్ లో ఆ పార్టీకి బ‌లం ఉంద‌ని మ‌రోసారి నిరూపితం అయింది. టీడీపీ, కూట‌మి అబ్య‌ర్థుల కోసం చంద్ర‌బాబు చేసిన రోడ్ షోలో ఆయ‌న ప్ర‌చారం మ‌హ‌కూట‌మి అబ్య‌ర్థుల‌కు బూస్ట్ నిచ్చింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా ఐటీ ప్రోఫెష‌న్స్ ఎక్కువ‌గా ఉండే చోట్ల‌… ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించారు.

నేను తెలంగాణ వ్య‌తిరేకిని కాదు, నేను తెలంగాణ అభివృద్ది కావొద్దు అనుకుంటే… ఈ ఐటీ ఇండ‌స్ట్రీని నా ఊరు తిరుప‌తికి తీసుక‌పోయేటోన్ని, చైన్నైకి కూడా ద‌గ్గ‌ర ఉండే తిరుప‌తిలో ఇంకా ఎక్కువ అభివృద్ది అయ్యేది. కానీ హైద‌రాబాద్ న‌గ‌రానికి తీసుకొచ్చా… అంటేనే అర్థం చేసుకోండి. నాకు తెలుగు ప్ర‌జ‌లంతా స‌మాన‌మే, మీకు కోసం మ‌ళ్లీ మ‌ళ్ళీ కృషి చేస్తానంటూ చంద్ర‌బాబు నిన‌దించ‌టం అంద‌రీనీ ఆక‌ట్టుకుంది.

నేను తెలంగాణ అభివృద్దికి అడ్డం అని న‌న్ను తిడుతున్న‌రు… నేను డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చేందుకు, మ‌హిళ‌ల‌కు మంత్రిప‌ద‌వుల విష‌యంలో అడ్డం వ‌చ్చానా అని ప్ర‌శ్నించారు. రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేందుకు అడ్డం వ‌చ్చానా అంటూ ప్ర‌శ్నించారు.

ఇక వీటితో పాటు కేసీఆర్ ఆరోపిస్తున్న మ‌హ‌కూట‌మి అధికారంలోకి వ‌స్తే… చంద్ర‌బాబు చేతిలో అధికారంలో ఉంటుంద‌నే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. కూట‌మి గెలిస్తే… కాంగ్రెస్ నుండే సీఎం అవుతార‌ని, మేము హోంశాఖ‌, ఇరిగేష‌న్ శాఖ‌లు తీసుకుంటామ‌ని చెప్ప‌టం వారి భ్రమ అంటూ స్ప‌ష్టం చేశారు.

మొత్తంగా… ఈ రెండ్రోజుల ప్ర‌చారంలో గ‌త నెల‌రోజులుగా కేసీఆర్ చేస్తోన్న తెలంగాణ వ్య‌తిరేక ప్ర‌చారాన్ని, ఆరోప‌ణ‌ల‌కు జ‌వాబులిస్తూ, జై తెలంగాణ నినాదాల‌తో  చంద్ర‌బాబు… కూట‌మి అడ్వాంటేజ్ చేసిన‌ట్లేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*