ఒక్క‌టైన కేసీఆర్, జ‌గ‌న్. వైసీపీ మ‌ద్ద‌తు టీఆర్ఎస్ కే.

Read Time: 1 minutes

అనుకున్న‌ట్లే అయింది… మ‌హ‌కూట‌మి పేరుతో టీడీపీ-కాంగ్రెస్ లు ఒక్క‌ట‌వడంతో, టీఆర్ఎస్ కు వైసీపీ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్న వైసీపీ… స‌డ‌న్ గా టీఆర్ఎస్ ట‌ర్న్ తీసుకుంది.

నిజానికి ఖ‌మ్మం, గ్రేట‌ర్ లోని కొన్న చోట్ల కొంత క్యాడ‌ర్, ప్ర‌జా బ‌లం ఉంది. ఆ పార్టీ పోటీలో ఉండ‌క‌పోవ‌ట‌మే ఒకింత ఆశ్చ‌ర్యం. అప్ప‌టికే… కేసీఆర్ తో వైసీపీ ములాఖ‌త్ అయింద‌ని, ఓట్లు చీల్చ‌కుండా ఉండేందుకే పోటీకి దూరంగా ఉంద‌న్న వార్త‌లు గుప్పుమన్నాయి. అయినా… ఆ పార్టీ ఎక్క‌డా నోరు మెద‌ప‌లేదు స‌రికదా, జ‌గ‌న్ పై క‌త్తితో దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌లోనూ… ఏపీ పోలీసులు స్పందించిన తీరుక‌న్నా, తెలంగాణ పోలీసులు త్వ‌ర‌గా రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ కూడా తెలంగాణ పోలీసుల పైనే న‌మ్మ‌క ముంచారు. అయితే, టీడీపీ అనూహ్యంగా నంద‌మూరి వార‌సురాలు సుహ‌సినిని బ‌రిలోకి దింప‌టంతో… కూక‌ట్ పల్లి పోరు ర‌స‌వ‌త్త‌రంగా, టీడీపీ వైపు మొగ్గుచూపుతున్న‌ట్లుగా క‌న‌ప‌డింది. దీంతో… ఆ ప‌రిస్థితి నివార‌ణ‌కు చ‌క్రం తిప్పిన కేటీఆర్, వైసీపీని కూక‌ట్ ప‌ల్లిలో మ‌ద్ద‌తివ్వాల‌ని చేసిన ఓత్తిడి ఫ‌లించింది.

వైసీపీ నుండి అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కాకున్నా, స్థానిక వైసీపీ నేత‌లు ప్ర‌త్యేకంగా ఓ స‌మావేశం నిర్వ‌హించి, కూక‌ట్ ప‌ల్లిలో త‌మ పార్టీ మ‌ద్ద‌తు టీఆర్ఎస్ కే న‌ని స్ప‌ష్టం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా… జై కేసీఆర్, జై జ‌గ‌న్ నినాదాలు చేయ‌టం కొస‌మెరుపు. అయితే… ఈ మ‌ద్ద‌తు కేవ‌లం కూక‌ట్ ప‌ల్లికే ఉంటుందా, రాష్ట్రమంతా ఉంటుందా అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉండ‌గా, జ‌న‌సేన అద్య‌క్షుడు ప‌వ‌న్ ఎటువైపు నిలుస్తార‌న్న‌ది ఇప్పుడు కీల‌కంగా మార‌నుంది. ఆయ‌న ఎవ‌రికీ మ‌ద్ద‌తివ్వ‌కుండా… త‌ట‌స్థంగా ఉంటారా, లేక‌… జ‌గ‌న్ లాగే కేసీఆర్ కు జై కొడుతారా అన్న ఆస‌క్తి నెల‌కొన్నా, ప‌వ‌న్ కేసీఆర్ కు మ‌ద్ద‌తు ప‌లికితే జ‌గ‌న్, ప‌వ‌న్ ఒక‌టేన‌ని తాము చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌య్యాయ‌ని టీడీపీ ఆరోపించే అవ‌కాశం ఉంది. ఈ నెల 27న త‌న నిర్ణ‌యం చెప్తాన‌న‌టంతో… జన‌సేన మ‌ద్ద‌తుపై ఇటు తెలంగాణ‌లోనూ, అటు ఆంద్రాల‌నూ రాజ‌కీయా నాయాకులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*