ఒక్క రాత్రి రూం కి ర‌మ్మంటూ… న‌టిని మెసెజ్, త‌ర్వాత ఏమైందంటే….

Read Time: 0 minutes

అస‌లే అందాల తార‌. మ‌ల‌యాళం, క‌న్న‌డ సినిమాల్లో… మంచి న‌టి. చాలా సినిమాలే చేతిలో ఉన్నాయి. అయితే… ఆ న‌టికి ఓ వ్య‌క్తి  ఒక్క రాత్రి త‌న రూంకు ర‌మ్మంటూ మెసెజ్ పెట్టాడు. ఇంత‌కు ఎవ‌రా న‌టి, ఎవ‌రా వ్య‌క్తి… ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది… చ‌ద‌వండి.

నేహ స‌క్సేనా… మ‌ల‌యాళ‌, క‌న్న‌డ సీనీ ఇండస్ట్రీలో… న‌టి. అందాలు ఆర‌బోస్తూ… రోమాన్స్ సీన్స్ లో న‌టించ‌టంలో ముందుంటుంది. అయితే, నేహ ఈ మ‌ద్య ఓ ప్ర‌మోష‌న్ కోసం అబుదాబి వెళ్ల‌గా, అక్క‌డో ఎల్స‌న్ అనే వ్య‌క్తి నేహ‌కు ఓ మెసెజ్ పెట్టాడు. నువ్వు చాలా అంద‌గా ఉన్నావ్, నీ రేటేంతో చెప్పు… ఒక్క రాత్రి నాతో గ‌డుపు, ఈ రాత్రికి రూంకు వ‌చ్చేయ్ అని ఆ మెసెజ్ సారాంశం. దీంతో అవాక్క‌యిన నేహ స‌క్సేనా, అత‌నికి అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఎల్స‌న్ పెట్టిన మెసెజ్ లు, వాట్సాప్ మెసెజ్ ల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టేసి, ఆ వ్య‌క్తిని ట్యాగ్ చేసింది. ఇంకేముంది… నిమిషాల్లో ఆ అంశం వైర‌ల్ కావ‌టం, ఎల్సన్ పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది. దాంతో… అత‌ను త‌న త‌ప్పు క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేస్తూ, త‌న ఫోన్ హ్య‌క్ అయింద‌ని, మ‌హిళ‌లంటే త‌న‌కు గౌర‌వం అంటూ వ‌క‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసినా, జ‌నం ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితిలో లేరు. అయితే… ఎల్స‌న్ కాళ్ల‌బేరానికి వ‌చ్చాడు. అబుదాబి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాన‌ని… త‌న కేరీర్ నాశనం అవుతుంద‌ని, త‌న కుటుంబానికి తెలిస్తే త‌న ప‌రువు పోతుందంటూ అత‌ను వేడుకుంటుండ‌గా, నెటిజ‌న్స్ మాత్రం… ఫైర్ అవుతూనే ఉన్నారు.

మీటూ ఉద్య‌మం న‌డుస్తున్న స‌మ‌యంలో… నేహ చేసిన ప‌నికి అంద‌రూ, మెచ్చుకుంటూ… నీ దైర్యం గొప్ప‌ది, మంచి ప‌నిచేశావ్ అంటూ కామెంట్స్ చేయ‌టం కొస‌మెరుపు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*