ఒక అబ్య‌ర్థి… రెండు చోట్ల నామినేష‌న్లు.

Read Time: 0 minutes

అబ్య‌ర్థి ఒక‌రే… కానీ రెండు చోట్ల నామినేష‌న్ వేశారు. అదేంటీ అనుకుంటున్నారా… ఒక సీటు తాను పోటీచేయాల‌నుకున్న‌ది అయితే, మ‌రో సీటు పార్టీ త‌న‌కు ఇచ్చింది. నామినేష‌న్ల ఆఖ‌రు రోజున ఈ తాజా సంఘ‌ట‌నకు తెర లేపారు టీడీపీ నేత సామ రంగారెడ్డి.

సామ రంగారెడ్డి. ఎల్ బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ‌పు బ‌ల‌మైన టీడీపీ నేత‌. ఇక్క‌డ నుండి పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. ఇక్క‌డ టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్.కృష్ణ‌య్య పార్టీకి దూరంగా ఉంటుండటంతో… ఈసారి త‌న‌కే టికెట్ అనుకున్నారు. కానీ పొత్తులో ఆ టికెట్ కాంగ్రెస్ కు పోయింది. దీంతో… ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ ముందు, అమ‌రావ‌తిలో నిర‌స‌న తెల‌ప‌టంతో… చంద్ర‌బాబు ఒత్తిడి మేర‌కు సామ‌కు ఇబ్ర‌హీంప‌ట్నం టికెట్ ఇచ్చారు. కానీ ఆయ‌న ఆస‌క్తి చూప‌లేదు. అయినా త‌ప్ప‌లేదు. మ‌రోవైపు ఈ సీటు కోసం కాంగ్రెస్ లో పెద్ద యుద్ద‌మే న‌డిచింది. దీంతో… బ‌ల‌మైన క్యామ మ‌ల్లేష్ స‌హ‌యం కోరారు రంగారెడ్డి. అత‌ను కూడా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లే ఇచ్చి, ఇండిపెండేంట్ గా నామినేష‌న్ వేయ‌టంతో… అయోమయంల ప‌డ్డ రంగారెడ్డి… త‌న ఆలోచ‌న‌కు ప‌దును పెట్టారు. అవ‌స‌ర‌మ‌యితే… విత్ డ్రా చేసుకోవ‌చ్చులే అనుకున్న‌ట్లున్నారు, ఓ సెట్ నామినేష‌న్ ను ఎల్ బి న‌గ‌ర్ నుండి వేయ‌గా, మ‌రో సెట్ నామినేష‌న్ ను ఇబ్ర‌హీం ప‌ట్నం నుండి టీడీపీ అబ్య‌ర్థిగా వేశారు. దీంతో… రంగారెడ్డి ఇష్యూ స్టేట్ వైడ్ టాపిక్ గా మారింది. ఒకే వ్య‌క్తి రెండు చోట్ల నామినేష‌న్ వేసిన ఒకే ఒక్కడిగా నిల‌బ‌డ్డారు.

అయితే, పార్టీ పెద్ద‌ల సూచ‌న మేర‌కు వెన‌క్కి త‌గ్గి, ఒకే చోట పోటీలో ఉంటారో…. నామినేష‌న్ ను విత్ డ్రా చేసుకుంటారో… లేదా ఎలాగు నామినేష‌న్ వేశాం కాబ‌ట్టి రెండూ చోట్ల పోటీలో ఉంటారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*