కాంగ్రెస్ ఆఫర్ల‌ను మించుతోన్న కేసీఆర్ హ‌మీలు.

Read Time: 1 minutes

అన్నీ పార్టీల‌కు… డిసెంబ‌ర్ 7 ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నందున‌, గెలుపు కోసం అన్ని దారులు అన్వేషిస్తున్నారు. ముఖ్య‌నేత‌ల ప్ర‌చారానికి కొంద‌రు, త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న కీల‌క ప్ర‌జానీకం మెప్పుకోసం మ‌రికొంద‌రు ర‌క‌ర‌కాల పాట్లు ప‌డుతుండ‌గా, కీల‌క‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం కేసీఆర్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

ఉచిత హ‌మీలు ఎలా అమ‌లు చేస్తారు, నిరుద్యోగుల‌ను ఎలా గుర్తిస్తారు, మీరిచ్చే హ‌మీలకు ద‌క్షిణాది రాష్ట్రాల బ‌డ్జేట్ మొత్తం కావాలంటూ… కాంగ్రెస్ హ‌మీల‌ను కొట్టిపారేసిన టీఆర్ఎస్ నేత‌లు, ఇప్పుడు కాంగ్రెస్ ను మించిపోయే హ‌మీల‌కు వెనుకాడ‌టం లేదు. ఓవైపు కాంగ్రెస్ హ‌మీలు, మ‌రోవైపు ప్ర‌బుత్వ వ్య‌తిరేక‌త‌తో… కేసీఆర్ దిగిరాక త‌ప్ప‌టం లేదు. ఇటీవ‌లే.. . ఉద్యోగులంతా ధ‌ర్మాగ్ర‌హ స‌భ పేరిట ప్ర‌బుత్వానికి హెచ్చ‌రిక‌లు పంపారు. వారు సంతృప్తిగా ఉంటే, ఎంతో మందిని ప్ర‌భావితం చేయ‌గ‌ల ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తాజాగా కేసీఆర్ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. ఇన్నాళ్లు ఆల‌స్య‌మైన‌…. ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచబోతున్నామ‌ని తెలిపారు. ఎన్ని సంవ‌త్స‌రాల‌కు పెంచుతామ‌ని ఓ నిర్ధిష్ట ప్ర‌క‌టన చేయ‌ని కేసీఆర్, వ‌య‌స్సు పెంచుతామ‌ని… ఉద్యోగుల‌కు న్యాయ‌మైన ఫిట్ మెంట్ ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే… ఈ హ‌మీల‌పై ఉద్యోగులు మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న‌ది ఆయ‌నే. ప‌క్క రాష్ట్రంలో ఏపీ ముఖ్య‌మంత్రి వ‌య‌స్సు పెంచి చూపించారు. కానీ కేసీఆర్ కు నాడు చేతులు రాలేదు, కానీ ఇప్పుడేమో… వ‌య‌స్సు పెంచుతామ‌ని హ‌మీ ఇస్తున్నార‌ని, ఫిట్మెంట్ పై కాలాయ‌ప‌న చేసిన ఆయ‌నే… త్వ‌ర‌గా నిర్ణ‌యం తీస‌కుంటామ‌ని చెబుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

ఇన్నాళ్లు లెక్క‌లేసుకున్న‌ట్లుగా… గెలుపు అంత హీజీగా ద‌క్కేలా లేద‌ని, అందుకే కేసీఆర్–టీఆర్ఎస్ లు ఉచిత హ‌మీల‌పై ప‌డి, కాంగ్రెస్ ను మించే ఆఫ‌ర్ల‌తో… ఓట్ల‌డుగుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*