కాంగ్రెస్ కీల‌క నాయ‌కుల ఆర్థిక‌మూలాల‌పై టీఆర్ఎస్ న‌జ‌ర్

Read Time: 0 minutes

పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో… టీఆర్ఎస్ పార్టీ మ‌రిన్ని అస్త్రాల‌ను సిద్దం చేస్తోంది. ప్ర‌చారం ఎవ‌రు ఎక్కువ చేశారు, ఎంత‌వ‌ర‌కు ప్ర‌జ‌ల మూడ్ ను ఆక‌ర్షించ‌గ‌లిగారు అనే అంశాలు ఎంత కీల‌క‌మో… పొలింగ్ తేదీ ముందు రోజు అంటే, ప్ర‌చారం తేదీ ముగిసే డిసెంబ‌ర్ 5 సాయంత్రం 5 గంట‌ల నుండి పోలింగ్ పూర్త‌య్యే వ‌ర‌కు ఉన్న రెండు రోజులు కూడా అంతే కీల‌కం. దీంతో అప్పుడెలా కూట‌మిని కొట్టాల‌న్న దానిపై టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధ‌మ‌యిపోయింది.

ప్ర‌జాద‌ర‌ణ‌తో పాటు, పోల్ మేనేజ్ మెంట్ ఎంత కీల‌క‌మో…  ఆంద్రా ప్రాంత 2014 ఎన్నిక‌లను చూస్తే అర్థ‌మ‌యిపోతుంది. ప్ర‌జాధ‌ర‌ణ వైసీపీకి ఉన్నా, చివ‌రి రెండ్రోజులు పోల్ మేనేజ్ మెంట్ తో అధికారంలోకి వ‌చ్చేసింది టీడీపీ. ఇప్పుడు కూడా స‌రిగ్గా అలాంటి ఎత్తుల‌కే తెర‌తీస్తోంది టీఆర్ఎస్.

ముఖ్యంగా నెక్ టు నెక్ ఫైట్ ఉండ‌బోతున్న స్థానాల‌ను గుర్తించి, అక్క‌డ కాంగ్రెస్ త‌రుపున పోటీచేయ‌బోతున్నా, కూట‌మి త‌రుపున పోటీచేయ‌బోతున్న నేత‌ల ఆర్థిక‌మూలాల‌పై దృష్టిపెట్టింది. రెండు, మూడు రోజులుగా టీఆరెఎస్ వేస్తోన్న అడుగులు చేస్తుంటే ఈ సంగ‌తి అర్థ‌మ‌యిపోతుంది. సంగారెడ్డిలో ట‌ఫ్ ఉంది. అక్క‌డ కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డికి ఎడ్జ్ ఉంది. ప్ర‌స్తుత ప‌రిస్థితే ఉంటే క‌నీసం 5వేల పై చిలుకు మెజారిటీ ఖాయం. కానీ ఇప్పుడు జ‌గ్గారెడ్డి ఆర్థిక మూలాల‌పై టీఆర్ఎస్ నిఘా పెట్టింది. అక్క‌డ ఏ ఇత‌ర మార్గాల నుండి జగ్గారెడ్డికి డ‌బ్బు రాకుండా చేసేసింది. త‌న సొంత భూమి అమ్ముకున్న మొత్తం కూడా రాకుండా, స‌ద‌రు వ్య‌క్తికి టీఆర్ఎస్ జెండా క‌ప్పేసింది.

ఇటు న‌ల్గొండ‌లోనూ అదే సీన్. ఆర్థికాంశాల‌తో ముడిప‌డి ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కీల‌క అనుచ‌రుడిపై వ‌ల వేసేంది. టీఆరెఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స‌ద‌రు నేత త‌లొగ్గాడు. ఇలా చివ‌రి రోజుల్లో కీల‌క‌మ‌య్యే అపోజిష‌న్ నేత‌ల కీల‌క అనుచ‌రుల‌ను ఒక్కొక్క‌రిగా పార్టీలోకి తీసుక‌రావ‌ట‌మో, లేదా సైలెంట్ అయ్యేలా వ‌ర్క‌వుట్ చేయ‌ట‌మో చేస్తున్నారు. పైగా… ఓ వైపు ఇలా ఎదుటి వారిని ఆర్థికంగా క‌ట్ట‌డి చేస్తూనే, మ‌రోవైపు టీఆర్ఎస్ భారీగా డ‌బ్బు ప్ర‌వాహానికి తెర‌తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తో పోటీప‌డాల‌ని ఉన్నా… పోటీ ప‌డ‌లేని స్థితిని క్రీయేట్ చేయ‌టం ద్వారా గెలిచే సీట్ల‌లో చివ‌రి రోజుల్లో డ‌బ్బులేక ఓడిపోయే స్థితికి తీసుకొచ్చే ప‌థ‌కం రూపోందిన‌ట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా రిజ‌ర్వ్డ్ స్థానాల్లో అయితే… ఈ వ్యూహాలు ఎక్కువ‌గా అమలు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

చూడాలి మ‌రీ… కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎత్తుల‌ను ఎంత‌మేర‌కు ఎదురించి, నిల‌వ‌గ‌లుగుతుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*