కాంగ్రెస్ కూట‌మికి వేధిక‌… తెలంగాణ ఎన్నిక‌లు.

Read Time: 1 minutes

ఏ ముహుర్తంలో కేసీఆర్ ముందస్తు  ఎన్నిక‌ల‌కు వెళ్లారోగానీ… కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నిక‌ల‌ను అత్యంత కీల‌కంగా, కీల‌క స‌మ‌యంలో క‌లిసివ‌చ్చిన అంశంగా భావిస్తోంది. ఇటు తెలంగాణ ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపొంద‌టంతో పాటు, కూట‌మి బ‌లోపేతానికి, జాతీయ రాజ‌కీయాల‌కు ఓ మెసెజ్ పంపిన‌ట్ల‌వుతుంద‌ని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

కేసీఆర్ కు వ్య‌తిరేకంగా… కాంగ్రెస్ తో టీడీపీ క‌లిసిరావ‌టం జాతీయాంశంగా చూస్తోంది కాంగ్రెస్. ఇప్ప‌టికే… టీడీపీ-కాంగ్రెస్ లు జ‌త‌క‌ట్ట‌డంతో పాటు, చంద్ర‌బాబు… ఇత‌ర జాతీయ నాయ‌కుల‌ను, బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌ను కాంగ్రెస్ కూట‌మిలోకి తెచ్చేందుకు గ‌ట్టిగాన ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక తెలంగాణ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం ద‌గ్గ‌ర నుండే… జాతీయ‌స్థాయి కాంగ్రెస్ కూట‌మికి అంకురార్ప‌ణ జ‌రగ‌బొతుంది. సోనియా- రాహుల్ గాంధీల ప్ర‌చార స‌భ‌లో… టీడీపీ, కోదండ‌రాం, సిపిఐ పార్టీలు పాల్గొన‌బోతుండ‌గా, ఈ నెల 29 నుండి రాహుల్ రెండ్రోజుల ప్ర‌చారానికి మ‌ళ్లీ హైద‌రాబాద్ రానున్నారు. ఆ స‌మ‌యంలో… రాహుల్ గాంధీతో పాటు, చంద్ర‌బాబు కూడా ప్ర‌చారంలో మొద‌టిసారి డ‌యాస్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు క‌లిసి… ఖ‌మ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇక‌, దేశంలోని ఇత‌ర జాతీయ నాయ‌కులైన‌… శ‌ర‌ద్ ప‌వార్, ప్ర‌పుల్ ప‌టేల్, మ‌మ‌త లాంటి నేత‌ల‌ను…. తెలంగాణ ప్ర‌చారంలో మ‌హ‌కూట‌మి త‌రుపున ప్ర‌చారం చేయాల‌ని ఆహ్వ‌నించారు. ఇదే జ‌రిగితే క‌నుక‌… జాతీయ స్థాయి కాంగ్రెస్ కూట‌మి బ‌ల‌ప‌డ‌టంతో పాటు, కేసీఆర్ వేసిన థ‌ర్ఢ్ ఫ్రంట్ ఎత్తుకు తెలంగాణ గ‌డ్డ‌పై నుండే పుల్ స్టాప్ పెట్టిన‌ట్లు అవుతుంద‌ని చంద్రబాబు అంచనా వేస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

ఇప్ప‌టికే రాహుల్–చంద్రబాబుల ఉమ్మ‌డి ప్ర‌చార షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. 29న ఖ‌మ్మంలో ఒక‌టి లేదా రెండు బ‌హిరంగ స‌బ‌లతో పాటు… హైద‌రాబాద్ లో ఉమ్మ‌డిగా రోడ్ షో ఉంటుంది. రెండో  రోజు తాండూరులో బ‌హిరంగ స‌భ‌తో పాటు, గ్రేట‌ర్ లో రోడ్ షోల‌కు ప్లాన్ చేసింది టీపీసీసీ.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*