కాంగ్రెస్ నుండి కేవీపీ ఔట్…?

Read Time: 1 minutes

కాంగ్రెస్ తో టీడీపీ జ‌త‌క‌ట్ట‌డం, రాహుల్ కూడా త‌మ‌తో ఒక్క మాట‌ చెప్ప‌కుండా… నిర్ణ‌యాలు తీసుకున్నారంటూ ఏపీలో సీనీయ‌ర్ కాంగ్రెస్ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ, కాంగ్రెస్ ను వీడుతున్నారు. మాజీ మంత్రులు పార్టీకి రాజీనామా చెప్పినా, తాజాగా కేవీపీ రాంచంద్ర‌రావు కూడా పార్టీకి గుడ్ బై చెప్పే యోచ‌న‌లో ఉన్నార‌న్న వార్త సంచ‌ల‌నం రేపుతోంది.

కేవీపీ-వైఎస్ లు ఆత్మబంధువులు. అంద‌రికీ తెలిసిందే. .. అలాంటి కేవీపీ… వైఎస్ కొడుకు జ‌గ‌న్ వెంట న‌డ‌వ‌కుండా… కాంగ్రెస్ తోనే ఉన్నారు. జ‌గ‌న్ ను కాద‌ని, కేవీపీ కాంగ్రెస్ తో న‌డుస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. వైఎస్ హ‌యంలో ఓ చ‌క్రం తిప్పిన కేవీపీ… రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత‌ల‌కు అత్యంత ఆప్తుడు. ఇప్ప‌టికి కూడా రెండు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే తెర‌వెనుక నాయ‌కుడ‌న్న పేరుంది. కాంగ్రెస్ నేతే అయినా, కేసీఆర్ తో మంచి సంబంధాలున్నాయ‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే… టీడీపీ, కాంగ్రెస్ ల క‌ల‌యిక పేరుతో కేవీపీ కూడా కాంగ్రెస్ ను వీడ‌నున్నారా అంటే అవున‌నే అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. అవ‌స‌ర‌మ‌యితే… కేవీపీ జ‌గ‌న్ కు జైకొట్టే అవ‌కాశం ఉంద‌ని, అదే జ‌రిగితే… వైసీపీకి ఎదురే ఉండ‌ద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. కానీ ఆ నిర్ణ‌యం జ‌రిగితే… దాని ప్ర‌భావం తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌పై కూడా ఉంటుంద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. అయితే… ఈ నిర్ణ‌యంతో ఏపీ రాజ‌కీయాలు ఎంతో మారిపోతాయ‌ని, వైఎస్ ఆత్మ క్షోబిస్తుంద‌ని… టీడీపీతో, చంద్ర‌బాబుతో వైఎస్ పోరాడితే… వీరు క‌లిసిపనిచేయ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అన్న నినాదంతో జ‌నాల్లోకి పోయే అవకాశం ఉంది. అప్పుడు వైఎఎస్ అభిమానం కేంద్రీకృత‌మ‌యి… జ‌గ‌న్ కు ఖ‌చ్చితంగా మేలు చేస్తుందంటున్నారు విశ్లేష‌కులు.

టీడీపీ-కాంగ్రెస్ క‌ల‌యిక‌… జ‌గ‌న్ పార్టీకి బంగారు ప‌ల్లెంలో అధికారాన్ని పెట్టి అప్ప‌గించ‌ట‌మేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*