కాంగ్రెస్ రెండో జాబితా, మ‌ళ్లీ అధిష్టానం మార్క్.

Read Time: 1 minutes

ఊహించిన‌ట్లుగానే కాంగ్రెస్ రెండో జాబితా కూడా విడుద‌ల చేసింది. అయితే… మొత్తం స్థానాల‌క కాకుండా… మ‌రో 20 స్థానాల‌ను ఇంకా పెండింగ్ లో పెట్టింది. మొద‌టి జాబితాలో 65, రెండో జాబితాలో 10 మంది అభ్య‌ర్థుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, మొద‌టి జాబితాలో పేర్లు లేవ‌ని, త‌మ‌కు అన్యాయం చేశారంటూ…. కొన్ని వ‌ర్గాలు చేసిన ఆరోప‌ణ‌ల‌ను అధిష్టానం లైట్ తీసుకుంది. గెలుపు గుర్రాల‌కే త‌మ ప్రాధాన్య‌త అన్న అంశానికే క‌ట్టుబ‌డ్డ‌ట్లు క‌న‌ప‌డుతోంది.

రెండో జాబితాలో…. సామాజిక వ‌ర్గాల‌ను ప‌క్క‌న‌పెడితే, అబ్య‌ర్థుల ఎంపిక‌లో గెలిచే వారికే చోటు క‌ల్పించింది. భూపాల ప‌ల్లి నుండి గ‌ట్టి అబ్య‌ర్థి, కాంగ్రెస్ సీనీయ‌ర్ నేత గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణౄ రెడ్డికి, ఖానాపూర్ నుండి ర‌మేష్ రాథోడ్ కు స్థానం క‌ల్పించింది. ఇక‌… మేడ్చ‌ల్ నుండి బ‌ల‌మైన నేత లక్ష్మారెడ్డికి, సిరిసిల్ల నుండి… కేటీఆర్ కు ఓట‌మి భ‌యాన్ని రేకేత్తిస్తున్న కేకే మ‌హేంద‌ర్ రెడ్డిని బ‌రిలోకి దింపింది. పీజెఆర్ వార‌సుడు ను కూడా బ‌రిలోకి దింపి, జూబ్లీహిల్స్ ను టీడీపీకి ఇవ్వ‌కుండా కాపాడుకోగ‌లిగింది. ఇక అనుకున్న‌ట్లుగానే ఖైర‌తాబాద్ ను దాసోజు శ్ర‌వ‌ణ్ చేతిలో పెట్టింది.

పార్టీకి లాయ‌ల్ గా ఉన్న‌వారితో పాటు, గెలిచేందుకు ఆస్కారం ఉన్న అబ్య‌ర్థుల‌నే ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించిన కాంగ్రెస్… మిగ‌తా జాబితాను కూడా రెండ్రోజుల్లో ఫైన‌ల్ చేయ‌బోతుంది. అయితే… ఈ జాబితాలో కూడా జ‌న‌గాం, తుంగ‌తుర్తిలాంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌క‌టించ‌కుండా ఇంకా పెండింగ్ లోనే పెట్టి… సస్పెన్స్ కంటిన్యూ చేస్తోంది.

కాంగ్రెస్ ప్ర‌క‌టించిన రెండో జాబితా…

ఖానాపూర్– ర‌మేష్ రాథోడ్

ఎల్లారెడ్డి— జాజుల సురేంద‌ర్

సిరిసిల్ల‌– కేకే మ‌హేంద‌ర్ రెడ్డి

మేడ్చ‌ల్–  ల‌క్ష్మారెడ్డి

ఖైర‌తాబాద్– దాసోజు శ్ర‌వ‌ణ్‌

షాద్ న‌గ‌ర్– ప్ర‌తాప్ రెడ్డి

భూపాల ప‌ల్లి– గండ్ర వెంక‌ట ర‌మణారెడ్డి

పాలేరు– ఉపేంద‌ర్ రెడ్డి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*