కాంగ్రెస్ రెబెల్స్ వెనుక టీఆర్ఎస్ నేత‌లు.

Read Time: 0 minutes

సీటు ఇవ్వాలంటే… త‌మ‌కు కోట్లు డిమాండ్ చేశారు. మేం ఎందుకు డ‌బ్బులు ఇవ్వాలి, పైస‌లు ఇవ్వ‌నందుకే, మేం త‌క్కువ కులంలో పుట్టినందుకే మాకు టికెట్లు ఇవ్వ‌లేదంటూ… కొంద‌రు నాయ‌కులు చేసిన వాఖ్య‌లు నిజంగానే అవేశంతో చేశారా, లేక మ‌రేదైన కుట్ర ఉందా… ఇప్పుడిదే చ‌ర్చ కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది.

కాంగ్రెస్ పార్టీలో కొంద‌రికి సీటు ద‌క్క‌క‌పోయిన మాట వాస్త‌మే అయినా, ఇప్పుడు టికెట్లు రాని వారు కూడా గ‌తంలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి ఓడిపోయారు, కానీ ఇవ్వాల టికెట్ రాక‌పోతే ఇంత రాద్దాంతం చేస్తున్నార‌న్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతుండ‌గా, నేత‌లు మాత్రం టిఆర్ఎస్ గేమ్ ప్లాన్ అంటున్నారు. ముఖ్యంగా క్యామ మ‌ల్లేష్ కు టీఆర్ఎస్ నేత‌ల‌తో మంచి సంబంధాలున్నాయ‌ని, కాంగ్రెస్ లో బీసీల‌కు అన్యాయం జ‌ర‌గుతుంద‌ని, కాంగ్రెస్ అంటే రెడ్డీ పార్టీ అనే విధంగా విమ‌ర్శించేందుకు టీఆర్ఎస్ నేత‌లు ఉసిగొల్పార‌ని అంటున్నారు.ఇటీవ‌ల పార్టీలో చేరిన నేత‌ల‌తో క‌లిసి, ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌లు ఈ కోవ‌లోకే వ‌స్తాయ‌ని… అందుకే రెడ్డీ కొడుకులు అంటూ తీవ్ర ప‌ద‌జాల‌న్ని వాడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే అన్ని వ‌ర్గాల‌కు అవ‌కాశం ఇస్తుంద‌ని… దాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని గుర్తుచేస్తున్నారు.

అయితే, ఇన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా… ఏ ఒక్క నేత కూడా బ‌హిరంగంగా, పార్టీకి అనుకూలంగా మాట్లాడ‌క‌పోవటం ప‌ట్ల కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ‌రి టికెట్ కోసం వారు బిజిగా ఉండి, పార్టీ ప‌రువుపోతున్న మాట్లాడ‌ట‌క‌పోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*