కాంగ్రెస్ లో కుదుపు… తెర‌పైకి టికెట్ల అమ్మ‌కాలు.

Read Time: 1 minutes

ఓవైపు మ‌హ‌కూట‌మిలో పొత్తులు పొస‌గ‌క‌, మ‌రోవైపు అసంతృప్తుల‌తో… ఇబ్బందిప‌డుతున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే వార్తే ఇది. కాంగ్రెస్ లో టికెట్లు అమ్మ‌కాలు జ‌రిగాయ‌ని, అందుకు ఆధారాలున్న‌ట్లు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో పాటు, కూట‌మి సీట్ల‌లో అమ్మ‌కాల‌పై స‌బితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి ర‌మ‌ణ పై ఆరోప‌ణ‌లు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వం వేసిన‌… స్క్రీనింగ్ క‌మిటీ చైర్మ‌న్ భ‌క్త చ‌ర‌ణ్ దాస్ స్వ‌యంగా డ‌బ్బులు తీసుకున్నార‌ని, నాకు ఇబ్ర‌హీం ప‌ట్నం టికెట్ కావాలంటే 3 కోట్లు ఇవ్వాల‌ని ఫోన్ చేశార‌ని తెలిపారు. అందుకు ఆధారాలున్న‌ట్లు కూడా ఆరోపించారు. ఇక దానం పై పోటీకి దాసోజు నుండి 10 కోట్ల రూపాయాలు వ‌సూల్ చేశార‌ని ఆరోపించ‌టంతో… కాంగ్రెస్ శ్రేణులు విస్తుపోయాయి.

వీటికి తోడు… మ‌హ‌కూట‌మిలో కూడా సీట్లు అమ్ముకున్నార‌ని, కాంగ్రెస్ పార్టీ గెలిచే సీటు రాజేంద్ర‌న‌గ‌ర్ ను ఎల్.ర‌మ‌ణ ప‌ట్టుబ‌ట్టి టీడీపీకి ఇప్పించ‌టం ఇందులో భాగ‌మేన‌ని, త‌ద్వారా మాజీ టీడీపీ నేత‌– టీఆర్ఎస్ అబ్య‌ర్థి ప్ర‌కాశ్ గౌడ్ నుండి భారీగా సొమ్ము ముట్టింద‌ని ఆరోపించారు. దీంతో… అస‌లు ఈ అమ్మ‌కాల మ్యాట‌రేంటీ, టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌కు… ఎన్నిక‌ల ప్ర‌చారం వేళ, కొత్త ఆయుధాన్ని ఇచ్చిన‌ట్ల‌యింద‌ని రాజకీయ విశ్లేష‌కులంటున్నారు. ఇంకెవ‌రయినా… ఇదే త‌ర‌హ విమ‌ర్శ‌లు చేస్తే, ప‌రిస్థితి మ‌రింత చేయిదాటుంద‌ని… వెంట‌నే నాయ‌కులు రంగంలోకి దిగాలంటున్నారు కార్య‌క‌ర్త‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*