కారు స్టీరింగ్ మా చేతిలోనే… ఓవైసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌.

Read Time: 0 minutes

ఎవ‌రు అధికారంలో ఉంటే ఆ పార్టీతో… చెట్టాప‌ట్టాల్ వేసుకొని తిర‌గ‌టం ఎంఐఎంకు అల‌వాటే. టీడీపీ, కాంగ్రెస్ ల‌తో పాటు ఇప్పుడు టీఆర్ఎస్ తో అదే దోర‌ణిలో ఉంటూ, త‌మ సీట్ల‌ను కాపాడుకుంటూ వ‌స్తోన్న ఎంఐఎం…. కారుకు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు త‌యారైపోయింది.

మీరు ఎక్క‌డైనా పోటీచేయండి మీ ఇష్టం. కానీ మా సీట్ల‌లోకి రావ‌ద్దంటూ… ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఇప్ప‌టికే కేసీఆర్ తో క‌లిశారు. కేసీఆర్ కూడా బ‌హిరంగంగానే ఎంఐఎంతో స్నేహ‌పూర్వ‌క‌పోటీయేన‌ని తేల్చిచెప్పారు. కానీ టీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో…. ఇప్పుడు ఎంఐఎం కారును టార్గెట్ చేయ‌టంతో, ప‌రిస్థితి వేడేక్కుతోంది.

టీఆర్ఎస్ గుర్తు కారు గుర్తు. కారు గ్రేట‌ర్ ప‌రిధిలో ఎక్క‌డికైనా వెళ్లొచ్చు. స‌న‌త్ న‌గ‌ర్, ఖైరాతాబాద్ తో స‌హ అవుట‌ర్ రింగ్ రోడ్డు ఎక్కి ఎటైనా వెళ్లండి కానీ, రాజేంద్ర‌న‌గ‌ర్ లోకి రానివ్వం… అంటూ టీఆర్ఎస్ తో సిట్టింగ్ సీటు పై కొత్త పంచాయితీ పెట్టారు. అంత‌టితో ఆగ‌కుండా… మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. రాజేంద్ర‌న‌గ‌ర్ నుండి ఎంఐఎం లో సీనీయ‌ర్ నేత‌కు కారు డ్రైవ‌ర్ గా ప‌నిచేసిన మీర్జా రెహ్మ‌త్ బేగ్ ను ప్ర‌క‌టించి, ఆయ‌న కోసం అస‌ద్ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. రాజేంద్ర‌న‌గ‌ర్ లో కారుకు చోటు లేదు, ఇక్క‌డ కారు మీదే అయినా… స్టీరింగ్ మాత్రం మా చేతిలో ఉంది. మీరు ఇక్క‌డికి రాలేరు అంటూ సూటిగా స్ప‌ష్టంగా తేల్చిచెప్పారు. దీంతో రాజేంద్ర‌న‌గ‌ర్ టీఆర్ఎస్ లో అల‌జ‌డి రేపుతోంది.

ఎంఐఎంకు ప్ర‌స్తుత‌మున్న 7 స్థానాల‌ను 10స్థానాల‌కు పెంచుకుంటే…. రాబోయేది సంకీర్ణ ప్ర‌బుత్వ‌మేన‌ని, ఆ సంకీర్ణ ప్ర‌బుత్వంలో తాము కీల‌కం కావ‌చ్చ‌ని, అందుకే త‌మ‌కు పట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఆనుకొని ఉన్న సీట్ల‌లో పోటీచేయాల‌ని ఎంఐఎం డిసైడ్ అయింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*