కూట‌మిదే అధికారం, తేల్చిన జాతీయ స‌ర్వే

Read Time: 1 minutes

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లి… కేసీఆర్ త‌ప్పు చేశార‌ని, టీఆర్ఎస్ కు మ‌రొసారి అధికారం ద‌క్క‌టం క‌లేన‌ని స్ప‌ష్టం చేస్తోంది సీఓట‌ర్–ఏబీపీ టీవీ స‌ర్వే. ఏ పార్టీకి ఏన్ని సీట్లు వ‌స్తాయి, ఎందుకు టీఆరెస్ ఓడిపోతుందో విశ్లేషించింది. స‌ర్వేల‌ను నిషేదం ప్ర‌క‌టించే ఒక రోజు ముందు ప్ర‌క‌టించిన స‌ర్వే తెలంగాణ‌లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

తెలంగాణ‌లో బ‌ల‌మైన నాయకుడిగా ఉన్న కేసీఆర్… ముంద‌స్తుకు వెళ్లి త‌ప్పు చేశార‌ని, ముంద‌స్తుకు వెళ్లేనాటికి తెలంగాణ‌లో కేసీఆర్ కు ఎదురే లేకున్నా, కాంగ్రెస్ తో టీడీపీ జ‌త‌క‌ట్ట‌డంతో ప‌రిస్థితి మారిపోయింద‌ని…. గ్రౌండ్ లో టీఆర్ఎస్  అబ్య‌ర్తుల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ కూడా తోడ‌వ‌టంతో… మ‌హ‌కూట‌మికే జ‌నం ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌ని తేల్చేసింది. కూట‌మి స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధిస్తుంద‌ని ప్ర‌క‌టించింది. మ‌హ‌కూట‌మి మొత్తం 64 స్థానాల్లో గెల‌వ‌బోతుంద‌ని, అధికార టీఆర్ఎస్ పార్టీ… 42 స్థానాల‌తో అధికారం కోల్పోనుంద‌ని తెలిపింది. ఇక దేశంలో అధికారంలో ఉన్న బీజేపి… రాష్ట్రంలో డిసైడింగ్ ఫాక్ట‌ర్ కావాల‌ని ఆరాట‌ప‌డ్డా… ఉన్న 5 స్థానాల్లో ఓ స్థానం కోల్పోయి… 4 స్థానాల‌కే ప‌రిమితం అవుతుంద‌ని ఏబీపీ-సీ ఓట‌ర్ సంస్థ స్ప‌ష్టం చేసింది.

టీడీపీ–కాంగ్రెస్ ల కొత్త పొత్తులు… తెలంగాణ‌లో ప్ర‌భావితం చూపిస్తాయ‌ని, వీటికి తోడు… ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న కోదండ‌రాం క‌లిసి రావ‌టం కూడా స్ప‌ష్ట‌మైన మెజారిటీ సాధించ‌డానికి తోడైంద‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*