కూట‌మి ఉమ్మ‌డి ఎన్నిక‌ల హ‌మీల ప్ర‌క‌ట‌న‌కు ముహుర్తం ఖ‌రారు.

Read Time: 0 minutes

మ‌హ‌కూట‌మి సీట్ల‌పై మంగ‌ళ‌వారం స్ప‌ష్ట‌త‌తో పాటు, అబ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేయాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ఉన్న కూట‌మి నేత‌లు… అన్నింటిక‌న్నా ముందు మ‌హ‌కూట‌మి త‌రుపున ప్ర‌క‌టించ‌బోయే ఎన్నిక‌ల హ‌మీల‌ను ప్ర‌క‌టించాల‌ని డిసైడ్ అయింది.

కాంగ్రెస్ క్యాంపెయినింగ్ క‌మిటీ చైర్మ‌న్ భ‌ట్టి ఇంట్లో… కోదండ‌రాం, గ‌ద్ద‌ర్ తో పాటు ఎల్.ర‌మ‌ణ‌లు భేటీ అయ్యారు. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక ఎలా ఉండాలి, ఉమ్మ‌డి ప్ర‌ణాళిక క‌మిటీ చైర్మ‌న్ గా కోదండ‌రాం ను ప్ర‌క‌టించ‌టం… మొత్తం రోడ్ మ్యాప్ పై ప్ర‌క‌ట‌న చేయాల‌ని మ‌హ‌కూట‌మి డిసైడ్ అయింది. అబ్య‌ర్థుల లిస్ట్, సీట్ల పంప‌కాల‌పై అన్ని పార్టీల నేత‌ల్లోనూ తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేత‌ల‌ను కూట‌మి కామ‌న్ మినిమమ్ ప్రోగ్రాం ను ప్ర‌క‌టించ‌టం ద్వారా.. కొంతైనా త‌గ్గించాల‌ని భావిస్తోంది. ఉద్యోగుల అంశం, నిరుద్యోగులకు ఉద్యోగాల క‌ల్ప‌న‌, క్యాలెండ‌ర్ ఈయ‌ర్ ప్ర‌క‌ట‌తో పాటు… రైతుల అంశాలు, శ్రామిక వ‌ర్గం అంశాలు కీల‌కంగా ఈ ఉమ్మ‌డి మ్యానిఫెస్టో ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే అన్ని పార్టీలు ఏక‌గ్రీవంగా ఈ అంశాల‌ను ఆమోదించ‌గా, కాంగ్రెస్ పార్టీ అధినాయ‌క‌త్వం ఆమోదంతో మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఇక క‌మిటీ చైర్మ‌న్ గా ప్ర‌క‌టించ‌బోయే కోదండారం కు… కూట‌మి అధికారంలోకి వచ్చాక‌, క్యాబినెట్ హోదాతో… యూపియే చైర్ ప‌ర్స‌న్ గా సోనియాగాంధీలా  ఉండేలా ఆయ‌న‌కు ఆఫర్ చేయ‌గా, ఆయ‌న కూడా అంగీక‌రించిన‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలంటున్నాయి. ఇక కోదండ‌రాం బ‌రిలోకి దిగాలా వ‌ద్ద అన్న చ‌ర్చ‌కు తావివ్వ‌కుండా…. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో…  ఆయ‌న్ను ప్ర‌చారానికే ఉప‌యోగించుకోవాల‌న్న ఆలోచ‌న‌తో ఉంది మ‌హ‌కూట‌మి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*