కేటీఆర్ కు మ‌హాన‌టి డైరెక్ట‌ర్ సూటి ప్ర‌శ్న‌లు.

Read Time: 0 minutes

తెలంగాణ‌లో… ముఖ్యంగా ప్ర‌పంచ‌శ్రేణి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని తీర్చిదిద్దినం అంటూ… గ్రేట‌ర్ ప్ర‌చారంలో కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ వ‌స్తున్నారు. కానీ… ఇక్క‌డ ప్ర‌భుత్వ పెద్దాసుప‌త్రుల తీరు ఎలా ఉందో చెప్పే ఘ‌ట‌న ఇది. మ‌హ‌న‌టి సినిమా డైరెక్ట‌ర్ స్వ‌యంగా లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

ఎప్పుడూ ట్విట్ట‌ర్ లో చురుగ్గా ఉండే… తాజా మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కు అదే ట్విట్ట‌ర్ వేధిక‌గా,  మ‌హ‌న‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ తీవ్ర అసంతృప్తితో, బాధ‌తో ట్వీట్ చేశారు. త‌న స్నేహితుడు ప్ర‌మాదంలో గాయ‌ప‌డితే… గాంధీ ఆసుప‌త్రిలో ప‌ట్టించుకున్న‌వాడే లేడ‌ని, చికిత్స అంద‌క మ‌ర‌ణించారు… దీనికి మీరేం స‌మాధానం చెప్తారంటూ నిల‌దీశారు. క‌నీసం లోప‌లికి తీసుకెళ్లేందుకు స్ట్రేచ‌ర్ కూడా లేదంటూ… తీవ్ర ఆవేధ‌న వ్య‌క్తం చేశారు.

నాగ్ అశ్విన్ వ‌ద్ద ప‌నిచేసే కెమెరామెన్, త‌న స్నేహితుడు ఆదివారంలో ఓ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో కెమెరామెన్ త‌ల్లితండ్రులు వెంట‌నే అత‌న్ని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ గాంధీకి తీసుక‌పోయినా… అక్క‌డ ఆదివారం కావ‌టంతో… డాక్ట‌ర్లు ఎవ‌రూ లేరు. దాదాపు మూడు గంట‌లు ప్రాణాల‌తో పోరాడిన అత‌ను, చివ‌ర‌కు క‌న్నుముశాడు. వైద్యం అంద‌క అత‌ను మ‌ర‌ణించ‌టంతో…. ఆ త‌ల్లితండ్రులు క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. గాయ‌ప‌డ్డ కుమారున్ని లోప‌లికి తీసుకెళ్లేందుకు స్ట్రేచ‌ర్ కూడా లేక‌పోవ‌టంతో… ఆ త‌ల్లితండ్రులే స్వ‌యంగా మోసుకుంటూ గంట‌ల త‌ర‌బ‌డి డాక్ట‌ర్ల కోసం అన్నీ రూంలు తిరిగినా ప్ర‌యోజనం లేకుండా పోయింది.

విష‌యం తెలిసిన నాగ్ అశ్విన్… గాంధీలో స‌రైన వైద్యం అందివుంటే త‌న స్నేహితుడు బ్ర‌తికుండే వాడ‌ని కేటీఆర్ కు ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశాడు. ఒక మనిషి ప్రాణాలు హైదరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్స్ లో బ్రతికించుకోలేమా అంటూ నాగ్ అశ్విన్ ఆవేదనతో తెలుపుతూ ప్రభుత్వ ఆసుపత్రి అంటే చావుకు నిర్లక్ష్యానికి మారుపేరు అనే అర్ధాన్ని మార్చడానికి ఏం చేస్తే బావుంటుందో చెప్పండి కేటీఆర్ సర్ అంటూ ట్వీట్ చేశారు. ఫైనల్ గా తన స్నేహితుడు రాష్ట్రంలోనే బెస్ట్ కెమెరామన్ అని వివరణ ఇస్తూ ఈ మరణంపై ఎవరిని ప్రశ్నించాలో అర్ధం కావడం లేదని ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని నాగ్ అశ్విన్ కోరారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*