కేటీఆర్ స‌వాలుకు కోమ‌టిరెడ్డి… సై

Read Time: 0 minutes

వంద‌సీట్లు గెల‌వ‌బోతున్నాం… వ‌చ్చే ది టీఆర్ఎస్ స‌ర్కారే, రాసిపెట్టుకోండి. టీఆర్ఎస్ స్వంతంగా అధికారంలోకి రాక‌పోతే నేను రాజ‌కీయ స‌న్యాసం చేస్తా. ద‌మ్ముంటే నా స‌వాలును స్వీక‌రించండి అంటూ కేటీఆర్ చేసిన స‌వాలుకు కోమ‌టిరెడ్డి సై అన్నారు.

మహాకూటమి తెలంగాణలో అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సంచలన ప్రకటన  చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని  మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వీకరించారు. ప్రజా కూటమి అధికారంలోకి రాకపోతే తాను  రాజకీయ సన్యాసనం చేస్తానని ప్రకటిస్తూనే…. కాంగ్రెస్ కు సవాల్ విసిరింది మంత్రి కేటీఆరా, సీఎం కేసీఆరో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  కేసీఆర్ ఎన్ని కుయుక్తులు పన్నినా,   విజయం తమదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని  కోమటిరెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీయే  బీసీలకు ఎక్కువ  సీట్లను  కేటాయించిందన్న కోమ‌టిరెడ్డి,  తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు కేటాయింపులో టీఆర్ఎస్ మోసం చేసిందని  ఆరోపించారు. దీంతో రాజ‌కీయం మ‌రింత వేడేక్కింది. టీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో వెళ్తే… క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌కుండా, జ‌నం తిర‌గ‌బ‌డ‌టం క‌న‌ప‌డ‌టం లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ కు ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా రాద‌ని జోస్యం చెప్పారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*