
కేసీఆర్ ను మళ్లీ అధికార పీఠం ఎక్కాలన్నా, తన కలల సౌధం ప్రగతి భవన్ లో ఇంకా కొనసాగాలన్నా, మళ్లీ కేటీఆర్ చక్రం తిప్పాలన్న…. ఇప్పుడు ఆశలన్నీ చంద్రబాబుపైనే ఉన్నాయి. అదేంటీ… చంద్రబాబు ఉన్నది మహకూటమిలో అయితే, కేసీఆర్ ను ఎందుకు రక్షిస్తాడనే కదా మీ డౌట్… అక్కడే ఉంది అసలు ట్విస్ట్.
మొదటి దశ ప్రచారంలో కేసీఆర్ చంద్రబాబును తిడుతూ, నోటికి పనిచెప్పాడు. కానీ అది వర్కవుట్ కాలేదు సరికదా… బూమ్ రాంగ్ అయ్యేట్లుందని గ్రహించి… కొడకు కేటీఆర్ ను గ్రేటర్ లో ముఖ్యంగా ఆంద్రా ప్రాంత సెటిలర్స్ ప్రాభల్యం ఉన్న చోటుకు పంపి… డ్యాడీ ఉద్దేశం అది కాదు, మీరంతా మా వాళ్లే… కడుపుల పెట్టుకుంటాం, హరికృష్ణ చనిపోతే… ఎలా సఫర్యలు చేశాం చెప్పుకొచ్చారు. సీన కట్ చేస్తే…
కేసీఆర్ రెండో దశ ప్రచారం మొదలుపెట్టారు. అభివృద్ది అంశాలు, మళ్లీ అధికారంలోకి వస్తే… క్రాప్ కాలనీలు, సంక్షేమ పథకాల మొత్తం పెంపు అని చెప్పిన జనం కన్విన్స్ అయినట్లు కనపడలేదు. అంతే….ఇక సెంటిమెంట్ ఉంటే తప్పా, గెలవటం కష్టమే అని ఓ అంచనాకు వచ్చాడు. అందుకే… మళ్లీ ఆంద్రోనికి ఓటేద్దామా, తెలంగాణోని చేతిలో కత్తిపెట్టి సంపుతుండు, మన మెడ కేసేస్తడు అంటూ….2014 ముందు, తెలంగాణ రాకముందు కేసీఆర్ చంద్రబాబు ను ఎలా తిట్టిపోశిండో అదే స్టైల్ రీపీట్ చేస్తుండు. అంటే… చంద్రబాబును తిడితే వచ్చే సెంటిమెంటే ఇక కేసీఆర్ రక్షించాలన్న మాట. ఆ ప్లాన్ కూడా వర్కవుట్ కాకపోతే, తన ఓటమి ఖాయం. అందుకే…. రోజుకు 6 సభలు పెట్టుకుంటూ, చంద్రబాబును తిడుతూ… ప్రతి అరగంట లేదా గంటకోసారైనా, టీవీల్లో కనపడుతూ…. కేసీఆర్ ప్రచారం సూపర్ అని చెప్పే ఎత్తుగడ వేశారు. ఇక చంద్రబాబు త్వరలో ఓట్లడిగేందుకు రాబోతున్నాడు. ఆయన ఎదో ఓక విమర్శ చేస్తాడు. దాన్ని పట్టుకొని ఆంద్రోనితో తిట్టిస్తున్నారు, ఆంద్రోనికి ఏం ఏరుక, వాళ్లతోనే కదా కొట్లాడింది… మళ్ల వారికే పాలన అప్పజెప్పుదామా… అంటూ కొత్త పల్లవి అందుకోబోతున్నాడు కేసీఆర్. సో అదన్నమాట మ్యాటర్. కేసీఆర్ చివరి ఆశలన్నీ ఇప్పుడు చంద్రబాబే.
Leave a Reply