కేసీఆర్ ఓట‌మికై… అమ‌రుల కుటుంబాల ప్ర‌చారం.

Read Time: 0 minutes

సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న గ‌జ్వేల్ లో ఆయ‌న్ను ఓడించేందుకు అమ‌రవీరుల కుటుంబాలు కూడా తోడైనాయి. అమ‌రుల కుటుంబాల‌కు తెలంగాణ‌లో న్యాయం జ‌ర‌గ‌లేదంటూ… ఆయ‌న్ను ఓడించాల‌ని వారు డిసైడ్ అయ్యారు. ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హిస్తుండ‌ట‌తో… అమ‌రుల కుటుంబ సభ్యుల‌పై దాడులు, కేసులు మొద‌ల‌య్యాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌టం కోసం త‌మ‌ను తాము బ‌లిదానం చేసుకున్న కుటుంబ స‌బ్యుల‌ను ఆదుకోవ‌డానికి అన్నీ పార్టీలు ముందుకు వ‌చ్చాయి. స్వ‌రాష్ట్రంలో అనాథ‌లైన ఆ కుటుంబాల‌ను క‌డుపులో పెట్టుకొని చూసుకుంటాన‌న్న కేసీఆర్, కంటితుడుపు చ‌ర్య‌లు చేప‌ట్టి, గాలికోదిలేశారు. దీంతో… ఆ కుటుంబ స‌భ్యులు ఇప్పుడు రోడ్డేక్కారు. త‌మ‌ను న‌మ్మించి మోసం చేసిన కేసీఆర్ ను ఓడించేందుకు జ‌త‌క‌ట్టి గ‌జ్వేల్ లో కాంగ్రెస్ త‌రుపున ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ఇది న‌చ్చ‌ని టీఆర్ఎస్ నాయ‌కులు వారిపై ఇప్ప‌టికే రెండుసార్లు దాడిచేయ‌గా, గురువారం మ‌రోసారి దాడి చేశారు. దీంతో వారంతా వెళ్లి గ‌జ్వేల్ పోలీసులకు మొర‌పెట్టుకున్నా ఫ‌లితం లేకుండా పొయింది. పైగా వారిపైనే అక్ర‌మ కేసులు బ‌నాయించి, అరెస్ట్ చేయ‌టం గ‌జ్వేల్ లో క‌ల‌క‌లం రేపుతోంది. దాదాపు 20 మందికి పైగా అమ‌రుల కుటుంబ సబ్యుల‌పై కేసులు న‌మోదు చేశారు జ‌గ‌దేవ్ పూర్ పోలీసులు.

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలోని జ‌గ‌దేవ్ పూర్ మండ‌లంలో అమ‌రవీరుల కుటుంబాలు ప్ర‌చారం చేస్తున్న సంద‌ర్భంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇక్క‌డి నుండి కేసీఆర్ ఫాంహౌజ్ అతి స‌మీపంగా ఉండ‌టం గ‌మనార్హం.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*