కేసీఆర్ కు కోలుకోలేని షాక్, కూట‌మి తరుపున థ‌ర్డ్ ఫ్రంట్ నేత‌లు

Read Time: 0 minutes

దేశ రాజ‌కీయాల‌ను శాసించాల‌ని, అందుకోసం న‌న్ను ఆశిర్వ‌దీంచండి అంటూ కేసీఆర్ దేశ వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఆయా రాష్ట్రాల్లో బ‌ల‌మైన ప్రాంతీయ నేత‌ల‌ను క‌లిశారు. కాంగ్రెసేత‌ర‌, బీజేపీయేత‌ర కూట‌మికి ప్ర‌య‌త్నాలు చేశారు. ఇంత‌లో ఎన్నిక‌లు రావ‌టంతో… ఆ అంశం అలా ప‌క్క‌దారి ప‌ట్టింది.

కానీ, ఎన్డీయే కూట‌మి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు… దేశ‌రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకోగ‌లిగారు. కేసీఆర్ పేర్కొన్న థ‌ర్డ్ ఫ్రంట్ నాయ‌కుల‌తో స‌త్సంబంధాలున్న చంద్ర‌బాబు, కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్ట‌డంతో ప‌రిస్థితులు మారిపోయాయి. కేసీఆర్ పేర్కొన్న థ‌ర్డ్ ఫ్రంట్ లో బ‌ల‌మైన ప‌క్షాలుగా ఉన్న మ‌మ‌తా బెనర్జీ, శ‌ర‌ద్ ప‌వార్, కుమార‌స్వామి, స్టాలిన్ లు.. చంద్ర‌బాబుతో పాటే, కాంగ్రెస్ కూట‌మికి ద‌గ్గ‌ర‌య్యాయి. కానీ, చంద్ర‌బాబు తెలంగాణ‌లో కాంగ్రెస్ తో క‌లిసి పోటీలో ఉండ‌టంతో… రాహుల్ ఈ నెలాఖ‌రును 29 వ తేదీల్లో రాష్ట్రంలో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్ర‌చారం గ్రేట‌ర్ లో జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ ప్ర‌చారానికి చంద్ర‌బాబు హ‌జ‌రు కావ‌టంతో పాటు, థ‌ర్డ్ ఫ్రంట్ నాయ‌కులైన మ‌మ‌తా బెన‌ర్జీ, శ‌ర‌ద్ ప‌వార్, కుమ‌రా స్వామిల‌ను కూడా అహ్వ‌నించారు. వారు కూడా సంసిద్ధ‌త వ్య‌క్తంచేశారు. అంటే… కేసీఆర్ కు వ్య‌తిరేకంగా థ‌ర్డ్ ఫ్రంట్ నేత‌లు కూడా ప్ర‌చారం నిర్వ‌హించ‌బోతున్నారు. కేసీఆర్ బీజేపికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ముసుగులో ఉన్నార‌ని ప్ర‌జ‌ల ముందుంచబోతున్నారు. దీంతో.. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితులు వేడేక్క‌నున్నాయి.

థ‌ర్డ్ ఫ్రంట్ నాయ‌కులు రాష్ట్రంలో కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప‌ర్య‌టిస్తే…. తెలంగాణ రాజ‌కీయం మారిపోతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇది నిజంగా కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు భారీ ఎదురు దెబ్బేన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*