కేసీఆర్ కు తాకిన సోష‌ల్ మీడియా సెగ‌.

Read Time: 0 minutes

ఈరోజుల్లో… మెయిన్ స్ట్రీం మీడియా క‌న్నా సోష‌ల్ మీడియా ఎంత ప్ర‌భావం చూపుతుందో రాజ‌కీయ నాయ‌కుల‌ను ఎవ‌ర్న‌డిగినా చెబుతారు. అయితే, సీనీయ‌ర్ నేత‌లకు పెద్ద‌గా వీటిపై అవగాహ‌న ఉండ‌దు అనుకుంటే… త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎప్పటిక‌ప్పుడు టెక్నాల‌జీకి ద‌గ్గ‌రగా ఉండే కేసీఆర్ కు సోష‌ల్ మీడియా సెగ త‌గిలింది.

మెయిన్ స్ట్రీం మీడియాలో క‌న్నా, సోష‌ల్ మీడియాలోనే టీఆర్ఎస్ ప‌నితీరుపై ఎక్కువ వ్య‌తిరేక‌త క‌న‌ప‌డుతోంది. ముఖ్యంగా డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, ద‌ళితుల మూడెక‌రాల భూమి అంశాలపై సోష‌ల్ మీడియా కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతోంది. దీంతో… సోష‌ల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే కేసీఆర్, ఖ‌మ్మం జిల్లా ప్ర‌చారం నుండి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. కేసీఆర్ ప్రారంబించిన మ‌లివిడుత ప్ర‌చారంలో… ఖ‌మ్మం, పాల‌కుర్తి స‌బ‌ల్లో కేసీఆర్ వీటిపైనే ప్ర‌దానంగా వివ‌రించారు. ఓవైపు ప్ర‌తిప‌క్షాల‌కు కౌంట‌ర్ ఇస్తూనే, త‌మ డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు గ‌తంలో ఇచ్చిన 7 ఇండ్ల‌కు స‌మానం అంటూ చెప్పుకొచ్చారు. ఇక ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి అంశాన్ని ప్ర‌స్తావించినా… అన్నీ ఈ నాలుగున్న‌రేండ్ల‌లో అయిపోతాయా, 60 ఏండ్ల‌లో సాధ్యం కానిది… ఇప్పుడెలా సాధ్య‌మవుతుందంటూ పాత రాగాన్నే కొత్త‌గా వినిపించే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, గ‌త స‌భ‌ల్లో కేసీఆర్ భాష‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం కావ‌టం, పాజిటివ్ క‌న్నా నెగెటివ్ ఎక్కువ‌గా వ‌స్తుంద‌న్న స‌ర్వేల‌తో.. కేసీఆర్ నోటికి ఈసారి త‌క్కువే ప‌నిచేప్పారు. కానీ నిరుద్యోగుల అంశాన్ని మాత్రం కేసీఆర్ ఎక్క‌డా పెద్ద‌గా ట‌చ్ చేయ‌లేదు. ఎలాగూ ఓట్లు త‌మ‌కు ప‌డ‌వ‌నుకున్నారో, చెప్పినా… నిరుద్యోగ యువ‌త త‌మ‌కు అండ‌గా ఉండ‌రు, న‌మ్మ‌రు అనుకున్నారో గానీ… నిరుద్యోగ వ‌రాల‌పై కేసీఆర్ స‌హ టీఆర్ఎస్ ముఖ్యులంతా మౌనం వ‌హిస్తున్నారు.

కేసీఆర్  కు ఇక నుండి నేరుగా చెప్ప‌లేని అంశాలు… సోష‌ల్ మీడియాలో హైలెట్ చేస్తే స‌రి కేసీఆర్ రెస్పాండ్ అవుతారు అంటున్నారు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*