కేసీఆర్ కు షాక్, హ్యండిచ్చిన ఉద్యోగ సంఘాలు.

Read Time: 1 minutes

తెలంగాణ ఉద్యమంలో, నాలుగున్న‌రేండ్ల పాల‌న‌లో కేసీఆర్ కు చేదోడు-వాదోడు గా ఉన్న ఉద్యోగ సంఘాలు కేసీఆర్ కు హ్యండిచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఇన్నాళ్లు అదిగో, ఇదిగో అంటూ కాలం వెల్ల‌దీసుకుంటూ వ‌చ్చిన కేసీఆర్ పై  ధ‌ర్మాగ్ర‌హా దీక్ష‌ను చేప‌ట్ట‌నున్నాయి.

తెలంగాణ ఉద్య‌మ‌మే కాదు, పాల‌న స‌జావుగా సాగాల‌న్న ఉద్యోగ‌-ఉపాద్యాయ సంఘాలు ఎంతో కీల‌కం. కానీ ఇప్పుడు వారు కూడా తిర‌గ‌బ‌డుతున్నారు. రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని టెన్ష‌న్ లో ఉన్న కేసీఆర్ కు తాజాగా ఉద్యోగా సంఘాలు ఇచ్చిన షాక్ తో మ‌రింత టెన్ష‌న్ కు గుర‌వ్వ‌బోతున్నారు. త‌న వెంట ఉండి, న‌డిచిన నేత‌లే… త‌న‌పై తిరుగుబాటు బావుట ఎగురేసేందుకు రెడీ అవటం నిజంగానే కేసీఆర్, టీఆరెఎస్ ల‌కు మింగుడుప‌డ‌ని అంశం.  పైగా… ఉద్యోగ సంఘాల డిమాండ్ల‌కు కాంగ్రెస మ‌ద్ద‌తు తెల‌ప‌టం, ముఖ్య‌మైన అంశాలు అధికారంలోకి రాగానే క్లియ‌ర్ చేస్తామ‌ని హ‌మీ ఇవ్వ‌టంతో….  ఉద్యోగులు కూట‌మి వైపు మ‌ల్లుతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.

70కి పైగా మ‌ద్ద‌తిస్తోన్న ఉద్యోగ సంఘాలు చేస్తున్న ప్ర‌ధాన డిమాండ్లు ఇవే.

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పున‌రుద్ధ‌ర‌ణ‌.

సీఎం హామీ మేరకు ఈ ఏడాది జూన్‌ 2 నుంచి 43% ఐఆర్‌ ఇవ్వాలి

పీఆర్సీ నివేదికను వెంట‌నే ప్ర‌భుత్వం స్పందించాలి.

ప్రభుత్వ రంగ సంస్థలకు వేతన స్థిరీకరణ

పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్లతో పాటు, ఉపాధ్యాయులకు సర్వీసురూల్స్‌ అమలు

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులందరినీ వెనక్కి రప్పించటం

అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు

70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్

ఈహెచ్‌ఎస్‌ ద్వారా నగదు రహిత వైద్యం

అంతర్‌ జిల్లా బదిలీలు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*