కేసీఆర్ కూ క‌లిసిరాని కాలం, ఫ్రంట్ కూ ఝ‌ల‌క్కే.

Read Time: 0 minutes

కాలం క‌ల‌సి రాక‌పోతే… ఎలా ఉంటుందో కేసీఆర్ ను చూస్తే తెలిసేలా  ఉంది. ఇప్ప‌టికే మ‌హ‌కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేల‌న్ని కోడై కోస్తుంటే, మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌జా ప్రంట్ అంటూ ఆ ఊరు, ఈ ఊరు తిరిగిన కేసీఆర్ కు చంద్ర‌బాబు, రాహుల్ చెక్ పెట్టేశారు.

త‌న‌కు మ‌రోసారి అధికారం ప‌క్కా అని క‌ల‌లుగ‌న్నా కేసీఆర్, దేశ రాజకీయాల వైపు దృష్టిపెట్టారు. కొడుక్కి సీఎం సీటు అప్ప‌జెప్పి… నేను డిల్లీ పోతా అంటూ బాహాటంగానే ప్ర‌క‌ట‌నలు గుప్పించారు. అందుకోసం… మ‌మ‌తా బెన‌ర్జీ, దేవ‌గౌడ లాంటి నేత‌ల‌తో పాటు, డీఎంకే తో దోస్తానాకి ప‌రుగెత్తారు. త‌మ‌ది థ‌ర్డ్ ఫ్రంట్ కాద‌ని… ప్ర‌జా ఫ్రంట్ అని, అందులో కాంగ్రెస్ ఉండ‌దంటూ తేల్చేశౄరు. కానీ… దేశంలో బీజేపీయేత‌ర కూట‌మిలో కాంగ్రెస్ లేకుండా సాధ్యం కాదంటూ… థ‌ర్డ్ ఫ్రంట్ లో కీల‌కంగా ఉన్న చంద్ర‌బాబు తేల్చేశారు. రాహుల్ కూడా… ప‌రిస్థితిని ముందుగానే గ‌మ‌నించి, బాబును ద‌గ్గ‌ర‌కు చేర్చుకొని… తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. మ‌మ‌త బేన‌ర్జీ, అఖిలేష్, మాయ‌వ‌తి, డీఎంకే, కుమార స్వామి, ఇలా అంతా ఇప్పుడు మ‌ళ్లీ కాంగ్రెస్ ద‌గ్గ‌ర‌కు చేరుతున్నారు. బాబు కూడా ఇందులో కీల‌కంగా వ్య‌వ‌హరించబోతున్నారు. దీంతో కేసీఆర్ దేశ రాజ‌కీయ యోచ‌న బెడిసికొట్టిన‌ట్లుగానే భావించ‌వ‌చ్చు. ఇక‌… ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధికారానికి దూర‌మైతే… ఆ ప్రభావం వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై కూడా ఉంటుంది. ఖ‌చ్చితంగా అది కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుంద‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు.

మొత్తానికి…. కేసీఆర్ క‌న్న క‌ల‌లు… ఒక్కోటిగా త‌న కండ్ల ముందే నీరుగారిపోతున్న‌ట్లుగా క‌న‌ప‌డుతున్నాయంటున్నారు విశ్లేష‌కులు

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*