కేసీఆర్, కేటీఆర్ బ్రతిమాలినా… డోంట్ కేర్ అనేసిన‌ వినోద్

Read Time: 0 minutes

స్వ‌యంగా కేసీఆర్ ఫోన్ చేసి… అడిగితే నేను బ‌రిలో నుండి త‌ప్పుకుంటా అని ఎదురుచూసిన నేతలు ఎంద‌రో. కేసీఆర్ ను క‌లిసి, నా బాధ చెప్పుకుంటా, పార్టీలో కొనసాగుతా అని చెప్పినా.. కేసీఆర్ అంద‌ర్నీ క‌ల‌వ‌లేదు. కానీ బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ బ్ర‌ద‌ర్స్ విష‌యంలో… కేసీఆర్, కేటీఆర్ లు స్వ‌యంగా వినోద్ ను బుజ్జ‌గించినా, డొంట్ కేర్ అనేశారు మాజీ మంత్రి.

చెన్నూర్ నుండి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ వివేక్ సోద‌రుడు మాజీ మంత్రి వినోద్ కు కేసీఆర్ నో చెప్పాడు. వివేక్  కు పెద్ద‌ప‌ల్లి ఎంపీ సీటు క్లియర్ చేసే ఉద్దేశంతో… బాల్క సుమ‌న్ ను చెన్నూర్ కు  పంపాడు. కానీ త‌న‌కు టికెట్ కావాల‌ని, అవ‌స‌ర‌మ‌యితే పార్టీ మారుతాన‌ని వినోద్ స్ప‌ష్టం చేశాడు. వివేక్, కేటీఆర్, కేసీఆర్ లు బుజ్జ‌గించినా… తొలుత కొంత‌మెత్తబ‌డ్డ‌ట్లు క‌న‌ప‌డ్డా… అనూహ్యంగా బెల్లంప‌ల్లి నుండి బ‌రిలో ఉన్నారు వినోద్. బీఎస్పీ నుండి వినోద్ బెల్లంప‌ల్లి బ‌రిలో ఉన్నారు. అయితే, వినోద్ బెల్లంప‌ల్లి వెళ్ల‌టం వెనుక చాలా పెద్ద త‌తంగ‌మే న‌డిచింద‌ని తెలుస్తోంది. బెల్లంప‌ల్లిలో టీఆర్ఎస్ తాజామాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌పై ప్ర‌జ‌ల్లో, పార్టీలో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. పైగా.. కాంగ్రెస్ నుండి ఇక్కడ అబ్య‌ర్థి లేరు. పొత్తులో భాగంగా… సిపిఐ నుండి గుండా మ‌ల్లేష్ బ‌రిలో ఉన్నారు. దీంతో… త‌న పాత పార్టీ కాంగ్రెస్ నుండి, టీఆర్ఎస్ అసంతృప్తుల నుండి త‌న‌కు మ‌ద్ద‌తు ద‌క్కుతుంద‌ని వినోద్ భావించిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌న, చెన్నూర్ ను వ‌దిలేసి, బెల్లంప‌ల్లి నుండి బ‌రిలో ఉన్నారంటున్నారు వినోద్ వ‌ర్గీయులు. అయితే, కేసీఆర్ స్వ‌యంగా బుజ్జ‌గించినా… వినోద్, లెక్క‌చేయ‌క‌పోవ‌టం స్థానికంగా పెద్ద చ‌ర్చే న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. అయితే… అధికారికంగా టీఆర్ఎస్ లో ఉన్న వివేక్ కు ఇప్పుడు ముందునుయ్యి, వెన‌క గొయ్యి అన్న‌ట్లు త‌యారైంది ప‌రిస్థితి.

చూడాలి మ‌రీ, వివేక్ ఈ తాజా సంక‌ట స్థితిని ఎలా అధ‌గమిస్తారో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*