కేసీఆర్, కేటీఆర్ ల అస్త్ర స‌న్యాసం దేనికి సంకేతం.

Read Time: 1 minutes

ఇంకా పూర్తిస్థాయి యుద్ద‌మే మొద‌ల‌వ‌లేదు, నామినేష‌న్లు ముగిసే స‌మ‌యానికే… కేసీఆర్, కేటీఆర్ ల మాట‌లు దేనికి సంకేతం, యుద్దంలో పోరాడుతూనే… ఓట‌మి పై ఎందుకు ఆలోచిస్తున్నారు, నిజంగానే కూట‌మి గెల‌వ‌బోతుందా….?వ‌

ఈసారి ఎన్నిక‌ల్లో 100సీట్లు గెల‌వ‌టం ఖాయ‌మ‌ని, మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని… అధికారం కోల్పోతే రాజ‌కీయ స‌న్యాసానికి సిద్దం అంటూ కేటీఆర్ ఈ మ‌ద్య ప్ర‌క‌ట‌న చేశారు. కేసీఆర్ కూడా… పోయిన ప్ర‌తిచోట ల‌క్షా మెజారిటీ ఈ సీటు నుండి మీరు ఇవ్వ‌బోతున్నారు అని చెబుతూనే… ఓడిపోతే మాకు వ‌చ్చిన న‌ష్టం ఏం లేదు, రెస్ట్ తీసుకుంటా… వ్య‌వ‌సాయం చేసుకుంటా… అంటూ యుద్దం జ‌రుగుతుండ‌గానే అస్త్ర స‌న్యాసం చేశారు. దీన్ని చాలా లోతుగా అంచ‌నా వేయాల్సి ఉంది. ఎందుకంటే, ఎదుటి వారిని మాన‌సికంగా దెబ్బ‌తీసే వ్య‌క్తిత్వం కేసీఆర్ ది. మాన‌సికంగా పై చేయి సాధిస్తూ, దూసుక‌పోవ‌టం ఆయ‌న నైజం. అలాంటి వ్య‌క్తి… ఎదో నెగెటివ్ ఫీడ్ బ్యాక్ లేక‌పోతే ఎందుకు అలా మాట్లాడుతారు అన్న‌ది ఇప్పుడు హ‌ట్ టాపిక్ గా మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేయించుకుంటూ, గ్రాఫ్ లెక్కేసుకునే కేసీఆర్ కు ఖ‌చ్చితంగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది, అందుకే అలా వేధాంత దోర‌ణిలో మాట్లాడారు అని అర్థం చేసుకోవ‌చ్చు.

ఈరోజు కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌, మొన్న‌టి కేటీఆర్ ప్ర‌క‌ట‌న‌లు అంత హీజీగా తీసివేయ‌టానికి లేదు. ఇప్ప‌టికే… టీఆర్ఎస్ అబ్య‌ర్థులు చాలా మంది మాన‌సికంగా ఓడిపోయారు. గ్రామాల్లోకి ప్ర‌జ‌లు రానీవ్వ‌టం లేదు. కేసీఆర్ పైనే భారం వేసి, కేసీరా్ కు ఓటేయండి అని ఓట్ల‌డుగుతున్నారు తప్పిస్తే, మాకు ఓటేయండి అని అడిగే ప‌రిస్థితి చాలామందికి లేదు. కానీ ఇప్పుడు కేసీఆర్–కేటీఆర్ లాంటి జోడెద్దులు ఈ ప్ర‌క‌ట‌న‌లు గులాబీదండును మ‌రింత గంద‌రగోళానికి, అందోళ‌నకు గురిచేస్తాయ‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*