కేసీఆర్ కొత్త ఎత్తుగ‌డ‌, వ‌ణికిపోతోన్న రేవంత్ రెడ్డి.

Read Time: 0 minutes

కాంగ్రెస్ నేత రేవంత్ కు కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. త‌న‌ను ఎలాగైనా ఓడించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కేసీఆర్ ఉన్నారు. అంతే ప‌ట్టుద‌ల‌తో… గెలుపు కోసం రేవంత్ అన్నీ దారులు వెతుకుతున్నారు. అయితే… రేవంత్ కు త‌న నామినేష‌న్ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. అస‌లు పోటీలోనే లేకుండా పోతానా…? అన్నఅనుమానంతో ఉన్నారు రేవంత్.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌న నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేలా… వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని, కేసీఆర్ ప్రైవేటు సైన్యంతో… నాపై కేసులు వేయిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డుతున్నారు.  అక్ర‌మే కేసుల‌తో… త‌న‌పై ఎక్క‌డ, ఎన్ని కేసులు న‌మోదు అవుతున్నాయో త‌న‌కే అర్థం కావ‌టం లేద‌ని, త‌ద్వారా… నా నామినేష‌న్ ను తిర‌స్క‌రించే కుట్ర ఉంద‌ని రేవంత్ అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల రేవంత్ త‌రుపున త‌న సోద‌రుడు ఓ సెట్ నామినేష‌న్ వేసేందుకు వెళ్లారు. కానీ ఆ నామినేష‌న్ స‌మ‌ర్పించిన వెంట‌నే… ఓ అధికారి, ఆ నామినేష‌న్ పై కంప్లైంట్ చేశార‌ని తెలుస్తోంది. ఆయ‌న త‌నపై ఉన్న కేసుల లెక్క‌ల‌ను చెప్ప‌లేద‌ని, అందుకే నామినేష‌న్ తిర‌స్క‌రించాల‌ని కోరార‌ట‌. దీంతో… రేవంత్ వ‌ర్గానికి టెన్ష‌న్ మ‌రింత పెరిగింది. త‌న నామినేష‌న్ తోనే త‌న‌ను ఇంటికి పంపించే ఎత్తులు ఉన్నాయ‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు.

అయితే, ఈ విష‌యంపై కొంత ముంద‌స్తు స‌మాచారంతోనే… రేవంత్ ఇటీవ‌ల హైకోర్టులో కేసువేసిన‌ట్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. త‌న‌పై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ వేసిన పిటిష‌న్  ఉద్దేశంతో అదేనంటోన్నాయి ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు. మ‌రీ… రేవంత్ ఈ కొత్త ఎత్తునుండి ఎలా బ‌య‌ట‌ప‌డుతారో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*