కేసీఆర్ ను చూసే జ‌నం మాకు ఓటేస్తారు– కేటీఆర్

Read Time: 0 minutes

సాధార‌ణంగా ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా… ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఎంత ముఖ్య‌మో, అబ్య‌ర్థి కూడా అంతే ముఖ్యం. కానీ.. కేటీఆర్ మాత్రం… త‌మ‌కు కేసీఆర్ ను చూసి ఓటేస్తార‌ని, అబ్య‌ర్థులు ముఖ్యం కాదంటున్నారు.

తెలంగాణ‌లో మ‌హ‌కూట‌మి సీట్లు ప్ర‌క‌టించి, అబ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాక‌… మాకు ప‌రిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయ‌ని జోస్యం చెప్పారు కేటీఆర్. 2014లో మాపై పూర్తిస్థాయిలో న‌మ్మ‌కం లేకే గ్రేట‌ర్ లో అప్పుడు సీట్లు రాలేదని, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింద‌ని తెలిపారు. కేసీఆర్ పూర్తిస్థాయి ప్ర‌చారాన్ని… త్వ‌ర‌లోనే ప్రారంభిస్తారంటున్న కేటీఆర్…సోనియా, రాహుల్ స‌భ‌ల ద్వారా త‌మ‌కు ఎలాంటి నష్టం ఉండ‌ద‌ని అంచానా వేస్తున్నారు. ఇక హ‌రీష్ స‌హా మా కుటుంబ స‌బ్యుల‌కు రాజ‌కీయాల క‌న్నా… కుటుంబ‌మే మాకు ముఖ్యం అని, మా పార్టీలో అసంతృప్తి పూర్తిగా స‌ద్దుమ‌ణిగింద‌న్నారు.

ఇక ఏపీలో లాగా తెలంగాణ‌లో కుల‌పిచ్చి లేద‌ని, అందుకే ఇక్క‌డ టీడీపీ ప్ర‌భావం ఉండ‌బోద‌ని విమ‌ర్శించిన ఆయ‌న‌, కోదండరాం గ‌త ఎన్నిక‌ల్లోనే కాంగ్రెస్ పార్టీ త‌రుపున త‌న క్యాండిడేట్లకు టికెట్లు ఇప్పించుకున్నార‌ని… ఇప్పుడు కూడా అదే చేస్తార‌ని విమ‌ర్శించారు. ఖ‌చ్చితంగా డిసెంబ‌ర్ 11న శ‌బ్ధ విప్ల‌వం రాబోతుంద‌ని, మ‌రో 15 సంవ‌త్స‌రాలు కేసీఆరే సీఎం అని చెప్పారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*