కేసీఆర్ పై ఈగ వాల‌నివ్వ‌కుండా చూస్తోన్న ఓవైసీ.

Read Time: 1 minutes

నా స్నేహితుడు. నా మ‌నిషి… మేమిద్ద‌రం ఒక‌టి. తిడుతే నేనే తిడుతా… అంతేకానీ మా కేసీఆర్ ను తిట్ట‌డానికి మీరేవ‌రు అన్న‌ట్లు ఉంది మ‌జ్లిస్ పార్టీ తీరు. కారు స్టీరింగ్ నాచేతిలోనే ఉంద‌ని ఓసారి, నా ముందు త‌ల‌వంచాల్సిందేన‌ని మ‌రోసారి… కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించిన ఓవైసీ బ్ర‌ద‌ర్స్, కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేసిన అమిత్ షాపై అనూహ్యంగా విరుచ‌క‌ప‌డ్డారు.

అమిత్ షాపై ఎంఐఎం నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర నేతలంతా మూకుమ్మ‌డిగా ప్ర‌చారం చేస్తోన్న సంద‌ర్భంలో… అమిత్ షా, సుష్మాస్వ‌రాజ్, రాహుల్ గాంధీ, చంద్ర‌బాబు, మాయ‌వ‌తి ఇలా నేత‌లంతా ఇక్క‌డే మ‌కాం వేసి ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌చారంలో భాగంగా… అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేస్తూ, ముస్లీంల‌కు బిర్యానీ పంపిస్తున్నాడ‌ని చేసిన విమ‌ర్శ‌ల‌పై అక్బ‌ర్ మండిప‌డ్డారు. మాకు బిర్యానీ పంపిస్తాడ‌ని ఆయ‌నకు ఇబ్బంది ఉన్న‌ట్లుంది. అమిత్ షాకు కూడా బిర్యానీ అంత ఇష్ట‌మ‌ని మాకు తెలియ‌దు. తెలిస్తే… అప్పుడే క‌ళ్యాణి బిర్యాణీ పంపించ‌మ‌ని కేసీఆర్ కు చెప్పేవాన్నంటూ విమ‌ర్శించారు. ఆయ‌న‌కు పెట్ట‌కుండా… మాకే బిర్యానీ పెడుతున్నారంటూ… అమిత్ షా అలిగిన‌ట్లుంద‌ని, కుళ్లుగా ఉన్న‌ట్లు  ఉంద‌ని… మ‌ళ్లీ ఈసారి అమిత్ షా వ‌చ్చిన‌ప్పుడు క‌ళ్యాణీ బిర్యాణీ పంపించే ఏర్పాట్లు చేస్తామంటూ చ‌మ‌త్క‌రించారు.

మాపై ఎడుస్తాడు అమిత్ షా… కానీ పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ కూత‌రు పెళ్లికి పిల‌వ‌కున్నా వెళ్లిండ‌ని, అప్పుడు మీకు–మోడీకి తెలియ‌దా…? అక్క‌డ ఏం పెడుతారో, ఏం ఉంటుందో అని నిల‌దీశారు. మ‌మ్మ‌ల్ని విమ‌ర్శించ‌టం కాదు… తెలంగాణ‌లో టీఆర్ఎస్– మ‌జ్లిస్ పార్టీల‌కు అవ‌గాహ‌న కుదిరింది. అందుకే స‌హ‌క‌రించుకొంటున్నాం. ముస్లీంలు ఎక్కువ‌గా ఉండి, మ‌జ్లిస్ పార్టీ నేత‌లు పోటీలో లేని చోట కేసీఆర్ కు ఓటేయాల‌ని, టీఆర్ఎస్ కు ఓటేయాల‌ని పిలుపునిస్తున్నామ‌ని తెలిపారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*