కేసీఆర్ పై మోడీ సెటైర్లు…

Read Time: 0 minutes

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ… కేసీఆర్ పై సెటైర్లు వేస్తూ, నిజామాబాద్ ప్ర‌చారంలో కేసీఆర్ ప్ర‌బుత్వాన్ని న‌డిపిన తీరుపై మండిప‌డ్డారు. ఏ ప‌ని చేసినా… స‌గం స‌గం చేయ‌టం త‌ప్పా, పూర్తిచేయ‌ని వ్య‌క్తి కేసీఆర్ అంటూ మండిప‌డ్డారు.

నిజామాబాద్ ను లండ‌న్ చేస్తా అని కేసీఆర్ అన్న‌డు. లండ‌న్ ఎట్లుంది… ఎలా ఉంద‌ని వెతుకుతూ వ‌చ్చిన‌. హెలికాప్ట‌ర్ లో వ‌స్తూ పైలెట్ కు చెప్పిన‌. ఓ రెండు సార్లు మొత్తం చ‌క్క‌ర్లు కొట్టండి… లండ‌న్ ఎట్లుందో చూద్దాం అని చెప్పిన‌. లండ‌న్ అంటే ఇట్ల‌నే ఉంట‌దా అంటూ ప్ర‌శ్నించారు. లండ‌న్ పోయి.. ఓ ఐదేండ్లు ఉండి రా. ఇక్క‌డ మీరు చేసింది ఇక చాలు…  అప్పుడు తెలుస్తుంది లండ‌న్ క‌థ అంటూ సెటైర్లు వేశారు. దీంతో స‌భలో ఉత్సాహాం ఒక్క‌సారిగా పెరిగిపోయింది. మోడీ కూడా ముసిముసి న‌వ్వులు న‌వ్వుకుంటూ త‌న ప్ర‌సంగాన్ని కంటిన్యూ చేశారు.

కేసీఆర్ జోతిష్యాన్ని న‌మ్మి రాజ‌కీయం చేస్తారు. నిమ్మ‌కాయ‌కు పూజ‌లు, మిర‌ప‌కాయ‌ల‌కు పూజ‌లు చేస్తాడు. కానీ… ఆయుష్మాన్ భ‌వ‌లో భాగంగా పేద‌ల‌కు పెద్ద రోగం వ‌స్తే స‌హ‌యం చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన ప‌థ‌కాన్ని ప‌క్క‌న పెట్టాడు అంటూ మ‌రో సెటైర్ వేశారు.

ఇక‌, కేసీఆర్ ఏ ప‌ని చేసినా… స‌గం స‌గం ప‌ని మాత్ర‌మే చేస్తారు. ఏదీ పూర్తిచేయ‌రు. ఏ ప‌ని చేసినా… మాట‌లు మాత్ర‌మే చెప్తారు.  అన్నీ సగ‌మే. ఆఖ‌రుకు ఐదేండ్లు ప‌రిపాలించాల‌ని ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చినా, ఆ ప‌ని కూడా స‌గ‌మే పూర్తిచేసి… ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లారు అంటూ విమ‌ర్శించారు.

ప్ర‌ధాని మోడీ… నిజ‌మాబాద్ ప్ర‌జ‌ల మూడుకు అనుగుణంగా, జ‌నాల‌ను ఉత్స‌హా ప‌రుస్తూ చేసిన ప్ర‌సంగానికి మంచి ఆధ‌ర‌ణ రావ‌టంతో, కేసీఆర్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో విమ‌ర్శ‌లు సందించారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*