కేసీఆర్ ప్ర‌చార‌మే… టీఆర్ఎస్ అబ్య‌ర్థుల ఆఖ‌రి ఆశ‌.

Read Time: 1 minutes

ఎన్నిక‌లు ముంచుకొచ్చేస్తున్నాయి. ఓవైపు నామినేష‌న్లు స్టార్ట్ అయిపోయాయి. కేసీఆర్ ప్ర‌చారం ఈ నెల 14 త‌ర్వాత గానీ మొద‌లు కాదు. ఒక‌వేళ‌ కేసీఆర్ ప్ర‌చారంకు వ‌చ్చిన చివ‌రి స‌మ‌యంలోనే. ఇప్పుడిదే టీఆర్ఎస్ అబ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి.

గ‌త 50 రోజుల నుండి టీఆర్ఎస్ అబ్య‌ర్తులు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. చాలామందికి, అనేక గ్రామాల్లో తిట్ల‌తో ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌లుకుతుండ‌గా, యువ‌కులు ఎందుకోసం వ‌చ్చావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయినా… నేత‌లు ఎదోఒక‌టి చెప్తూ ప్ర‌చారాన్ని నిర్వ‌హించుకుంటున్నారు. కానీ… ఈ 50 రోజుల్లో చాలామంది నేత‌ల‌కు గెలుపుపై పూర్తిస్థాయి న‌మ్మ‌కం క‌లిగిన‌ట్లు క‌న‌ప‌డ‌టం లేదు. తెలంగాణ భ‌వ‌న్ లో బీఫాం పంచే కార్య‌క్ర‌మంలో కూడా కేసీఆర్ ఓవైపే స‌ద‌రు అబ్య‌ర్తులంతా ఆశ‌గా చూశార‌ట‌. ఇంతో అంతో ప్ర‌భావితం చేసే హ‌రీష్… గ‌జ్వేల్, సిద్దిపేట‌ల‌కే ప‌రిమితం కావ‌టం, ఇత‌ర నాయ‌కుల‌కు గెలుపోట‌మ‌లు ప్ర‌భావితం చేసే స్థాయి లేక‌పోవంతో…. అబ్య‌ర్తుల చివ‌రి ఆశ ఇక కేసీఆరే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కేసీఆర్ కూడా ఈ నెల 14న గ‌జ్వేల్ లో నామినేషన్, ర్యాలీలు ముగించుకొని… 15 నుండి గానీ ప్ర‌చారం మెద‌లుపెట్టేలా లేరు. దీంతో… కేసీఆర్ వ‌చ్చి, స్థానికంగా స‌మస్య‌ల‌ను ప్ర‌స్తావించ‌టం, హ‌మీలివ్వ‌టం… ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను-అబ్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తే త‌ప్పా… త‌మ‌కు గెలుపు అంత హీజీ కాదంటున్నారు. అదే చివ‌రి ఆశ అని… ఇప్ప‌టి వ‌ర‌కు అదిగో వ‌స్తున్న, ఇదిగో వ‌స్తున్న అని కాలాయ‌పాన చేసినా… ఎదో ఇలా వ‌చ్చి అలా పోయినా పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌ద‌ని నేత‌లు పెద‌వి విరుస్తున్నారు.

అయితే, ఈ 15 నుండే కూట‌మి నేత‌లు కూడా ప్ర‌చారాన్ని ఉదృతం చేయ‌బోతున్నారు. దీంతో… పోరు హోరాహోరీ త‌ప్ప‌దంటున్నారు విశ్లేష‌కులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*