కేసీఆర్ ముహుర్తానికే…. టీఆర్ఎస్ అబ్య‌ర్థులు క్యూ.

Read Time: 1 minutes

సాధార‌ణంగా ఎవ‌రి న‌మ్మ‌కం వారిదే. నామినేషన్ ఎప్పుడు వేయాలి, ఏ స‌మ‌యానికి వేయాలి అని వారి, వారి న‌మ్మ‌కాల‌ను బ‌ట్టి… వారి, వారి సిద్దాంతుల‌ను బ‌ట్టి ఉంటుంది. కానీ ఈసారి గ‌తానికి భిన్నంగా టీఆర్ఎస్ అబ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు.

కేసీఆర్… ఈరోజు మ‌ద్యాహ్నం 2.34కు నామినేష‌న్ వేశారు. అది ఆయ‌న‌కు ఆయ‌న న‌మ్మే సిద్దాంతులు చెప్పిన విష‌యం. కానీ… కేసీఆర్ ప‌లానా ముహుర్తానికే నామినేష‌న్ వేయ‌బోతున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. సాధార‌ణ జ‌నానికి కూడా మంచి ముహుర్త‌మ‌ట అని చ‌ర్చించుకునేలా చేసింది. కేసీఆర్… ఈ విష‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటాడు. దీంతో… ఆయ‌న్నే అనుస‌రించారు ఆయ‌న పార్టీ నేత‌లు. స‌రిగ్గా కేసీఆర్ నామినేష‌న్  వేసిన ముహుర్తానికే… మాజీ మంత్రులు, చాలా మంది టీఆర్ఎస్ అబ్య‌ర్థులు నామినేష‌న్లు వేసిన‌ట్లు తెలుస్తోంది.  దీంతో… ఒక గొర్రె బావిలో దూకితే, మిగ‌తావ‌న్నీ దూకిన‌ట్లు… ఇదేంది కొత్త‌గా అని మీడియా వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ఎప్ప‌టిలాగే… నేత‌లంతా అన్నీ వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో, గుడి– మ‌సీదు– చ‌ర్చిల‌ను క‌వ‌ర్ చేస్తూ… పూజ‌లు చేస్తూ… నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేసేందుకు వెళ్లారు. కేసీఆర్ ఇవ్వాల  మంచి ముహుర్త‌మ‌నే… రెండో ద‌శ ప్ర‌చారాన్ని కూడా మొద‌లుపెట్టారు. అందుకే, దాదాపు మెజారిటీ టీఆర్ఎస్ అబ్య‌ర్థులు త‌మ  నామినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని పూర్తిచేసుకోగా, కాంగ్రెస్ పార్టీలో సీట్లు ద‌క్క‌ని నేత‌లు కూడా రెబ‌ల్ అబ్య‌ర్థులుగా కొంత‌మంది పోటీలో దూకేశారు.

చూడాలి… మ‌రీ కేసీఆర్ ముహుర్త‌బ‌లం, ఇత‌ర నేత‌ల‌కు ఎంత‌వ‌ర‌కు స‌హ‌య‌ప‌డుతుందో.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*