కేసులు మ‌ళ్లీ మ‌ళ్లీ వేస్తానంటోన్న ఇళ‌య‌రాజా

Read Time: 0 minutes

మ్యూజిక్ మ్యాస్ట్రో… లెజెండ్ ఇళ‌రాజా, గాన త‌ప‌స్వీ ఎస్పీ బాలసుబ్ర‌మ‌ణ్యం మ‌ద్య  మొద‌లైన కాపీ రైట్ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. మా మ‌ద్య ఏలాంటి భేదాబిప్రాయాలు లేవ‌ని ఎస్పీ బాలు చెప్పినా, దావా వేసిన ఇళ‌య రాజా, త‌న పాట‌ల‌ను ఎవ‌రూ పాడిన వ‌దిలేది లేదంటూన్నారు.

నా పాట‌లు పాడుతూ… మీరు ఆదాయం తీసుకుంటారు. అవి నా పాట‌లు. కానీ నా పాట‌ల‌కు మీరు డ‌బ్బు తీసుకుంటూ… నాకు వాటా ఎందుకు ఇవ్వ‌రు, ఇక‌పై  నా పాట‌లు ఎవ‌రు పాడిన కేసులు వేస్తానంటూ ఇళ‌య‌రాజా హెచ్చ‌రిక‌లు పంపారు. ఇందుకోసం త‌ను ఓ వీడియో కూడా విడుద‌ల చేశారు.

మీరు దేశ విదేశాల్లో… ఎక్క‌డైనా.. నా పాట‌లు పాడే ముందు, సంగీతాన్ని ఇచ్చే ముందు నా ప‌ర్మిష‌న్ తీసుకోవాలి. దానికి సంబందించిన నిబంధ‌న‌లు పాటిస్తూ, రాయ‌ల్టీ ఇవ్వాల్సిందే. లేక‌పోతే… లీగ‌ల్ యాక్ష‌న్ త‌ప్ప‌ద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు నేను ఐపీఆర్ లో స‌భ్యున్ని, ఇక పై స‌బ్య‌త్వం వ‌ద్దు…  నా రాయ‌ల్టీ వ‌సూలు చేసే హ‌క్కును, నా త‌రుపున ద‌క్షిణ భార‌తీయ సీనీ సంగీత క‌ళాకారుల సంఘం వ‌సులు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. సింగర్స్  కూడా ఇందులోకి వస్తారు. సింగర్స్  నా పాటలు పాడేందుకు నేను అడ్డుచెప్పడం లేదు. మీరు తీసుకుంటున్న డబ్బుకి మాత్రం రాయల్టీ ఇవ్వాలని అడుగుతున్నాను అని తెలిపారు.

అయితే… ఇళ‌యారాజా మ‌రో క్లారిటీ కూడా ఇచ్చి, త‌న‌పై ఉన్న అభిమానాన్ని కాపాడుకున్నార‌ని చెప్పుకోవ‌చ్చు. గాయ‌నీ గాయ‌కులు ఉచితంగా పాడితే మాత్రం… మీరు ఎన్ని పాట‌లైనా పాడుకోండి. నాకు రాయ‌ల్టీ అవ‌స‌రం లేదు. ప‌ర్మిష‌న్ అవ‌స‌రం లేదు. మీరు విదేశాల్లో షోలు చేస్తూ, పాట‌లు పాడుతూ డ‌బ్బు సంపాదిస్తే మాత్రం నాకూ ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. భవిష్యత్  తరాలకు ఇది మార్గదర్శకంగా ఉండాల‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నాని, నా అభిమానులు… శ్రేయోభిలాష‌లు అర్థం చేసుకోవాల‌ని తాజా వీడియోలో కోరారు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*