కొడుకుల‌తో ప‌ని అయిపోయింది. ఇప్పుడు తండ్రితో కూడా…..

Read Time: 0 minutes

హీరోయిన్స్ అంతా… ఇష్టాయిష్టాల‌తో ప‌నిలేకుండా, అవ‌కాశం ఉన్న‌ప్పుడే ప‌ని కానిచ్చేస్తున్నారు. అది వ‌ద్దు, ఇలా వ‌ద్దు అన్న మాటే వారి వెంట రావ‌టం లేదు. మ‌రీ ముఖ్యంగా కొత్తగా వ‌స్తోన్న తార‌ల‌యితే…. ఈ విష‌యంలో ప‌క్కాగా ఉంటున్నారు. ఎవ‌రీ గురించి ఇదంతా అనుకుంటున్నారా… స‌వ్య‌సాచి సినిమాలో చైతూ ప‌క్క‌న న‌టించిన అమ్మ‌డి గురించే.

సాధార‌ణంగా ఒక్క హిట్ వ‌స్తే చాలు… న‌ట‌న బాగుంద‌న్న కొన్ని మంచి మార్కులు ప‌డ్డా చాలు… మ‌రో నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్న‌ట్లే. అయితే, స‌వ్య‌సాచి సినిమాతో అక్కినేని నాగ‌చైత‌న్య‌తో రోమాన్స్ చేసిన నిధి అగ‌ర్వాల్… ఆ సినిమాకు ముందే… అక్కినేని అఖిల్ తో సినిమా మొద‌లుపెట్టేసింది. స‌క్సెస్ లేక‌, ఒక భారీ విజ‌యం కోసం ఎప్ప‌టి నుండో వెయిట్ చేస్తూ వ‌స్తోన్న అఖిల్ తాజా సినిమా మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ సినిమాలో కూడా నిధి అగ‌ర్వాలే హీరోయిన్. అయితే… ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌టంతో… ఇప్పుడు ఈ అమ్మ‌డు కళ్ల‌న్ని మ‌న్మ‌థుడు అక్కినేని నాగ‌ర్జున‌పై ప‌డ్డ‌ట్లు ఉన్నాయి. ఇటీవ‌లే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కొడుకుల‌తో చేసేశా, ఇక నాగ‌ర్జున‌తో చేయ‌ట‌మే మిగిలివుంది అని బ‌య‌ప‌డింది. ఆయ‌న గురించి చాలా విన్నాను… ఆయ‌న‌తో కూడా సినిమా ఎప్పుడు చేస్తానా అని ఎగ్జ‌యిట్ గా ఉన్నా. త్వ‌ర‌లోనే అవ‌కాశం రావాల‌ని కోర‌కుంటున్నా… అంటూ ఇప్పుడే ఓ కర్చీప్ వేసిపెట్టింది.

దీంతో ఈమె బాగానే ఫాస్ట్ గా ఉన్నా, మ‌రీ ఇంత ఫాస్ట్ అయితే… క‌ష్ట‌మే అంటున్నారు అక్కినేని అభిమానులు.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*