కొత్త‌ద‌న‌మే లేని యువరాజా స్పీచ్.

Read Time: 1 minutes

ఆయ‌న పార్టీ గెలిస్తే…  కాబోయే ముఖ్య‌మంత్రి. పార్టీలో నెం.2 స్థానం… కేసీఆర్ త‌ర్వాత స్టార్ క్యాంపెయిన‌ర్ల‌లో ఒక‌రు. ఆయ‌న ప్ర‌చారానికి వ‌స్తే, అంత‌కు ముందు ఆ త‌ర్వాత అన్న‌ట్లు ఉండాలి రాజ‌కీయం. కానీ కేటీఆర్ స్పీచ్ లు జ‌నాల‌కు ఎందుకు ఎక్క‌టం లేదు, అస‌లేంటీ కార‌ణం…?

కేసీఆర్ స్పీచ్ అంటే… టీఆర్ఎస్ నాయ‌కులు, జ‌న‌మే కాదు, ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా అంతే ఆస‌క్తితో చూస్తారు. ఆయ‌న అంటే గిట్ట‌ని వారు కూడా…. ఆయ‌న వాగ్ధాటిని మెచ్చుకోకుండా ఉండ‌లేరు. కానీ… టీఆర్ఎస్ కు కాబోయే బాస్, టీఆర్ఎస్ నేత‌లు అనుకున్న‌ది అనుకున్న‌ట్ల‌యితే… కాబోయే సీఎం కేటీఆర్. కానీ ఆయ‌న ప్ర‌చార స‌భ‌లు మాత్రం పెద్ద‌గా ఆస‌క్తిగా సాగ‌టం లేదు. అదే మూస దోర‌ణిలో, సామెత‌ల కోసం వెతుకుతున్న‌ట్లుగా క‌న‌ప‌డుతున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా దీపావ‌ళి త‌ర్వాత‌, నామినేష‌న్ల నుండి ఇప్ప‌టి వ‌ర‌కు కేటీఆర్ చేసిన ప్ర‌సంగాల‌న్నీ ఒకే త‌ర‌హాలో ఉంటున్నాయి. అదే ముసలావిడ క‌థ‌తో పెన్ష‌న్లు, రైతుబందు ప‌థ‌కం, గ‌తానికి-టీఆర్ఎస్ ప్ర‌బుత్వాన్ని పోలుస్తూ చేసే రేష‌న్ బియ్యం అంశం… అన్నీ సేమ్ టు సేమ్.

అస‌లు చూడకుండా… ఆయ‌న స్పీచ్ వింటే, ఇది నిన్నే మాట్లాడారు క‌దా అని చెప్పినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అంతలా సాగుతోంది కేటీఆర్ స్పీచ్. ఇటు టీఆరెఎస్ అబ్య‌ర్థులు కూడా కేసీఆర్ త‌ర్వాత‌, హ‌రీష్ రావు ప్ర‌చారాన్నే ఎందుకు కోరుకుంటారు అంటే ఇందుకే అని స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. తెలంగాణ‌లో ఉన్న ఉమ్మ‌డి ప‌ది జిల్లాల్లో కూడా చాలా ర‌కాల ఆచార వ్య‌వ‌హ‌రాలు, వారి వారి సంస్కృతి భిన్నంగా ఉంటుంది. వారికి త‌గ్గ‌ట్లుగా… మ‌నలో ఒక‌డిగా మాట్లాడే బాష ఇంకా కేటీఆర్ ఓంట‌బ‌ట్టించుకోలేద‌న్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనూ, నేత‌ల్లోనూ క‌న‌ప‌డుతోంది.

ఇప్ప‌టికైతే… మించి పోలేదు కానీ, త‌ర్వాత త‌ర్వాత అయినా కేటీఆర్ త‌న ప్ర‌సంగ స్టైల్ మార్చుకుంటారో లేదో చూడాలి.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*