కొన‌సా….గుతున్న కాంగ్రెస్ అబ్య‌ర్థుల ఎంపిక‌

Read Time: 0 minutes

ఎన్నిక‌ల‌కు రెడీ అయి, వెంట‌నే ప్ర‌చారంలోకి దిగాల‌ని ఆలోచ‌న‌లో ఉన్న కాంగ్రెస్ నేత‌లు…. అబ్య‌ర్థులను ఫైనల్ చేసే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే డిల్లీలో రెండ్రోజులుగా అధిష్టానం తెలంగాణ అబ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేసే ప‌నిలో ఉంది. గురువారం అబ్య‌ర్థుల‌ను ప్రక‌టించే అవ‌కాశం ఉందంటున్నాయి గాంధీబ‌వ‌న్ వ‌ర్గాలు.

మంగ‌ళ‌వారం ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు, మ‌ళ్లీ బుధ‌వారం ఉద‌యం నుండే… అబ్య‌ర్థుల వ‌డ‌బోత కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఓ సీటుకు ముగ్గురు అబ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేసి, ఏఐసీసీకి పంప‌గా… ఒక‌ర్ని ఇప్పుడు ఎంచుకోబోతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ తో పాటు ఇత‌ర సీనీయ‌ర్ నేత‌లు డిల్లీలోనే మ‌కాం వేశారు. అయితే… ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌పై ఇప్ప‌టికే అబ్య‌ర్థుల ఎంపిక పూర్త‌యింద‌ని, ద‌క్షిణ తెలంగాణ‌లో… పెద్ద‌గా పార్టీకి అబ్య‌ర్థుల విష‌యంలో ఇబ్బందిలేద‌ని… గురువారం సాయంత్రం క‌ల్లా లిస్ట్ విడుద‌ల చేస్తార‌న్న ప్ర‌చారం న‌డుస్తోంది. కొన్ని స్థానాల్లో… ఒక‌రికి మించి గ‌ట్టి అబ్య‌ర్థులు పోటీలో ఉన్నందున‌, వారితో నేరుగా మాట్లాడి…. ఎమ్మెల్సీ అవ‌కాశం పై హ‌మీ ఇస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే… కూట‌మిలోని టీడీపీ, టీజెఎస్ ల‌కు కూడా సీట్ల‌పై క్లారిటీ ఉంది. వారికి అబ్య‌ర్థులు కూడా రెడీ గా ఉండ‌టంతో… ఉమ్మ‌డి లిస్ట్ విడుద‌ల‌పై కూడా అధిష్టానం ఆలోచిస్తుంద‌ని తెలుస్తోంది. ఎంత ఆల‌స్య‌మైనా… ఒక‌టి రెండ్రోజుల్లో ఈ మొత్తం వ్య‌వ‌హ‌రాన్ని ముగించి, ఈనెల 10 నుండి సీరీయ‌స్ గా ప్ర‌చారంలోకి దూస‌కాల్సిందేన‌ని ఏఐసీసీ పెద్ద‌లు ఇప్ప‌టికే సూచించారు. దీంతో… ఈ నెల 10 నుండి కాంగ్రెస్ క్యాంపెయినింగ్ జెట్ స్పీడ్ లో వెళ్ల‌బోతోంది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*