క‌లిసి తిరిగి… ఇప్పుడు మీటూ అంటే ఎలా…?

Read Time: 0 minutes

బాలీవుడ్, టాలీవుడ్ అనే కాదు… దేశంలోని అన్ని భాష‌ల్లో మీటూ ఉద్య‌మం సృష్టించిన సంచ‌ల‌నం తెలిసిందే. అప్పుడు అత‌ను అలా న‌న్ను బ‌ల‌వంతం చేశాడు, గ‌దికి పిలిచాడు…నన్ను లైంగిక ఇబ్బందిపెట్టాడు, న‌న్ను న‌గ్నంగా ఫోటోలు తీశాడు… ఇలా రోజుకో ఆరోప‌ణ సినిమా ఇండస్ట్రీపై రోత పుట్టించేలా చేశాయి.

అయితే తాజాగా, ఓ బాలీవుడ్ హీరోయిన్ చేసిన కామెంట్స్… అంద‌రినీ ఆలోచింప‌జెస్తున్నాయి. అవ‌స‌రం ఉన్న‌న్ని రోజులు, మోజు తీరే వ‌ర‌కు తిరిగి… రిలేష‌న్ లో ఉండి, ఇప్పుడు నాకు కూడా అలా జ‌రిగింది మీటూ అన‌టం ఏమిట‌ని డైరెక్ట్ గా ప్ర‌శ్నించింది. విష‌యంలోకి వెళ్తే….  బాలీవుడ్ హీరో న‌వ‌జుద్దీన్ సిద్ధిఖీపై అనేక లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. సిద్దిఖీ  మాజీ ప్రేయ‌సి, మాజీ మిస్ ఇండియా నీహ‌రిక‌సింగ్ మీటూ ఆరోప‌ణ‌లు చేసింది. ఎంతో మంది జీవితాల‌ను నాశ‌నం చేశాడ‌ని ఆరోపించింది. అయితే ఆమె  చేసిన  ఆరోప‌ణ‌ల‌పై మ‌రో న‌టి ఘాటుగానే స్పందించింది.  నిహ‌రిక‌సింగ్ కామెంట్స్ కు రిప్లై ఇస్తూ… న‌టి కుబ్రా స‌య‌త్ చేసిన ఓ పోస్టు వైర‌ల్ అవుతోంది. సిద్ధిఖీతో రిలేష‌న్ లో ఆమె చాలా రోజులు ఉంది. కొన్ని విభేదాల కార‌ణంగా వారిద్ద‌రు విడిపోయారు, కానీ అవి మీటూ కిందికి ఎలా వ‌స్తాయ‌ని సూటిగా ప్ర‌శ్నించింది. అవి లైంగిక వేధింపులు ఎలా అవుతాయ‌ని అడిగింది. ఆమె కొన్ని ఇబ్బందులు త‌న నిజ జీవితంలో ఎదుర్కొని ఉండొచ్చు కానీ, సానుభూతి కోసం మ‌రీ ఇంతలా దిగ‌జారాలా అని ప్ర‌శ్నించింది.

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*