గద్దర్ అన్న గిట్ల చేసిండేంది… చంద్రబాబు సంకనెక్కిండు

Read Time: 1 minutes

మాటలను, పాటలను తూటాలు గా చేసి… జనం కోసం పీడిత వర్గం కోసం ప్రాణాలను లెక్క చేయని గద్దర్ అన్న ఇట్లా చేసిండు ఏంది, వెనక నుండి బులెట్ దించింన వ్యక్తిని ఆత్మీయ ఆలింగనం ఎట్లా అయిందని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక రాసిన లేఖ యధావిధిగా…..

గద్దర్..గద్దర్ అంటే ప్రజాగొంతుక..పోరాట యుద్ధనౌక..అంతకుమించి దళిత జాతి వేదిక.ప్రజాగొంతుక నేడు వలసనేతల పాదాలకు బానిసైందా..? పోరాట పథం విడచి చెంచాగిరి పంచన చేరిందా..? దళితవాదాన్ని దహించిన అగ్రనాయకుల మోచేతికి దోసిలి చాపిందా..? నేడు తెలంగాణ ఎన్నికల సమరంలో తెలంగాణ వ్యతిరేకులతో కలిసిన గద్దర్ నీళ్లు నిధులు నియామాకాలంటూ గొంతెత్తిన గద్దర్ స్వరం, మా భూములు మా పాలన మాకేనని నినదించిన గద్దర్ అన్నీ మరచి తెలంగాణా పోరాటాన్ని అవమాన పరచిన చంద్రబాబు సంకలో చేరిండు.  ఎందరో ఉద్యమ యోధుల ఆత్మబలిదానాలను మరచి తెలంగాణలో చిచ్చు పెట్టాలని కంకణం  కట్టుకున్న చంద్రబాబు పంచన చేరిండు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏకమైన వేదికపై తెలంగాణ పోరాట గీతం గొంతుకను హత్యచేసిండు గద్దర్.
ఆత్మగౌరవానికి ఎదురునిలిచి పోరాడిన నీ తనువు..నేడు ఆత్మగౌరవాన్ని పాతరేస్తున్న  కుటిలత్వాన్ని కౌగలించుకున్నది. నీ కడుపులో మరుగుతున్న తూటాలు నీకు గుచ్చుకోలేదా..నువు హత్తుకున్నది మనిషిని కాదు నీకు తూటాలు ఎక్కుపెట్టిన తుపాకీని. నాడు నీ మీద దాడికి ఖండిస్తూ ఏకమైన తెలంగాణ పోరుపౌరులు యాదికొస్తలేరా గద్దర్ అన్న..? పోరాటం తెలంగాణ కొసవాకిట్లో కన్నీరు కారుస్తోంది.ఆత్మగౌరవం పొలిమేరలో ఆత్మబలికి సిద్ధపడింది.దళితజాతి ఊరవతలి బ్రతుకే బాగుందని సిగ్గుతో ముడుచుకుపోతోంది. ఏందీ గద్దరన్న ఇది నీకు తగునా..?
ఒక్కసారి నీ తనువులో కాపురముంటున్న తూటాలనడుగు నీ ఉనికి చెప్తుంది..మరొక్కసారి తెలంగాణ చంద్రున్నడుగు నీ ఆత్మగౌరవ విలువను వెలిగిస్తాడు..పోరాటం..ఆత్మగౌరవం మనకు దొరికేది మన తెలంగాణలోనే మన తెలంగాణ వాళ్లతోనే గద్దర్ అన్న..ఉద్యమ వందనాలతో..బరువెక్కిన గుండెతో
ఇట్లు..
నేను..
నీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని.. అంటూ ముగించారు.

తెలంగాణ ప్రజల కోసం కూటమి లో జత కట్టినా…. గద్దర్– చంద్రబాబు ల ఆలింగనం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు…

Google Ads

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*